కేటిఆర్ మామను వదల బొమ్మాలీ అంటున్న రేవంత్

First Published 11, Dec 2017, 1:43 PM IST
Revanth vows  to bring KTR father in law to book
Highlights
  • తప్పుడు ఎస్టీ సర్టిఫికెట్ తో ఉద్యోగం చేశాడు
  • కేసిఆర్ కు దమ్ముంటే చర్యలు తీసుకోవాలి
  • లేకపోతే కోర్టుకు పోయి సర్కారు బట్టలూడదీస్తాం
  • కేటిఆర్ మామ నుంచి జీతభత్యాలు రికవరీ చేసి శిక్షించాలి

కేటిఆర్ కు పిల్లనిచ్చిన మామ పాకాల హరినాథ్ పై రేవంత్ మరో బాంబు పేల్చారు. పాకాల హరినాథ్ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఫారెస్టు శాఖలో ఉద్యోగం కొట్టేశాడని ఆరోపించిన రేవంత్... తాజాగా ఆ ఆరోపణల తాలూకు ఆధారాలు కూడా బయటపెట్టారు.

సోమవారం గాంధీభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ డాక్యుమెంట్స్ ను రేవంత్ విడుదల చేశారు.  ఏ రాజకీయనేత అయినా కుటుంబ సభ్యులు, బంధువుల పై ఆరోపణలు వచ్చినప్పుడు పారదర్శకంగా వివరణ ఇవ్వాలని చురకలు వేశారు. ఎన్నికల ముందు గిరిజనులకి ఇచ్చిన హామీలను సీఎం కెసిఆర్ తుంగలో తొక్కారని ఆరోపించారు.

పరిపాలనలో అవకతవకలకి పాల్పడితే ఎంతటి వారినైనా శిక్షిస్తా అని గతంలో కెసిఆర్ అన్న విషయాన్ని గుర్తూ చేస్తూ.. కేటీఆర్ మామ పాకాల హరినాధ్ రావ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటిఆర్ మామ ఎస్టీకి సంబంధించిన తప్పుడు సర్టిఫికెట్ తో మోసపురితంగా ఫారెస్ట్ ఉద్యోగం సంపాదించాడని తెలిపారు. గిరిజనులను మోసం చేసి విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న హరినాధ్ రావ్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

హరినాధ్ రావ్ పై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా కాంగ్రెస్ ఎస్టీ సెల్ నేతలు సీఎం కెసిఆర్,చీఫ్ సెక్రెటరీ,ఫారెస్ట్ అధికారికి లేఖ రాస్తారని వెల్లడించారు. తప్పు చేశాడని ప్రభుత్వానికి ఎప్పుడు తెలిసినా.. శిక్ష పడాల్సిందే కదా అని ప్రశ్నించారు. కేటిఆర్ మామ మీద చర్యలు తీసుకొనట్లయితే ప్రభుత్వం గిరిజనులని మొసం చేసినట్లే అని భావించాల్సి వస్తుందన్నారు. తన మామ చేసిన మోసం మంత్రి కేటీఆర్ కి కనిపించడంలేదా అని కేటిఆర్ ను నిలదీశారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే కోర్ట్ లో ప్రభుత్వాన్ని బట్టలూడదీస్తామని హెచ్చరించారు.

తన ఆరోపణలపై స్పందించాల్సింది టీఆరెస్ పెంపుడు నేతలు కాదు ..కేటీఆర్ ,కేసీఆర్ మాత్రమే స్పందించాలని సవాల్ చేశారు. కేటీఆర్ మామ 35ఏళ్ళ సర్వీస్ కాకుండా  ఇప్పుడు పెన్షన్ కూడా తీసుకుంటున్నారని, అలాంటప్పుడు అతడిని ఎందుకు శిక్షించరాదని ప్రశ్నించారు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకుని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విశ్వాసం కల్పించాలని కోరారు.

ఎస్టీ ల పేరుతో కేసీఆర్ వియ్యంకుడు ఉద్యోగాన్ని చేసింది ముమ్మాటికీ నిజం అని స్పష్టం చేశారరు. ట్విట్టర్ లో పలికే కేటీఆర్ కు తన మామ ఎస్టీ ప్రజలకు చేసిన మోసం కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి పొందిన జీతభత్యాలన్నీ హరనాథ్ రావు నుండి రికవరీ చేసి  శిక్షించాలని డిమాండ్ చేశారు. వియ్యంకుడిని కాపాడాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.  

loader