కామారెడ్డిలో కేసీఆర్‌ను ఢీ కొట్టనున్న రేవంత్ రెడ్డి...!

ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కామారెడ్డినుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కొడంగల్ నుంచి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి, కామారెడ్డిలో కూడా పోటి చేయనున్నట్లు సమాచారం. 

Revanth to Take on KCR in Kamareddy, telangana - bsb

హైదరాబాద్ : తెలంగాణలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా ఉండనున్నాయి. అధికార బీఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దించాలని ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఆచితూచి అడుగేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇటీవలే మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. కొంతమంది అభ్యర్థులను రెండు చోట్ల నుంచి బరిలోకి దింపుతోంది. దీంట్లో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలబడబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే రేవంత్ రెడ్డి  కొడంగల్ నుంచి పోటీ చేయనున్నట్లుగా పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని కూడా కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీకి నిలపాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ టికెట్ ను మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆశించారు. 

తెలంగాణలో అడుగుపెడితే యూపీ సీఎం యోగిని చంపేస్తారట..: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ఈ మేరకు ఆయన ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ,  ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ ఈ మేరకు నిర్ణయాన్ని మార్చడంతో.. షబ్బీర్ అలీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే, ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందనేది అధికారికంగా జాబితా వెళ్లడైన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం తాను కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండే పోటీ చేస్తానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించారు. సోమవారంనాడు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో షబ్బీర్ అలీ పర్యటించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను కామారెడ్డి నుండి పోటీ చేయడం లేదని  తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి తాను పోటీ చేస్తానని  సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి పలు దఫాలు  షబ్బీర్ అలీ  కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించారు. మరోసారి కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  షబ్బీర్ అలీ  తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి ఈ దఫా బీఆర్ఎస్ అభ్యర్ధిగా  కేసీఆర్ బరిలోకి దిగనున్నారు. గంప గోవర్థన్ ఈ దఫా పోటీకి దూరంగా ఉంటున్నారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి మరోసారి షబ్బీర్ అలీ తన అదృష్టాన్ని  పరీక్షించుకోవాలనుకుంటున్నారు. 

అయితే, కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కామారెడ్డి నియోజకవర్గం పేరు లేదు.  దీంతో  కామారెడ్డి నుండి  షబ్బీర్ అలీ కాకుండా  రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతారనే ప్రచారం అప్పుడు కూడా సాగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని  షబ్బీర్ అలీ అంటున్నారు. ఇక ఏ విషయం కాంగ్రెస్ ప్రకటించబోయే రెండో జాబితాతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గురువారం రెండు జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios