హార్టికల్చర్ విద్యార్థుల ఆందోళనకు రేవంత్ మద్దతు తెలంగాణ సర్కారు మెడలు వంచడం విద్యార్థలకు పెద్ద పనికాదు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా సర్కారు నాటకాలు హార్టికల్చర్ విద్యార్థులకు టిడిపి మద్దతు ఉంటది

తెలంగాణ కోసం పోరాటం చేసింది విద్యార్థులే. తెలంగాణ తెచ్చిన విద్యార్థులకు తెలంగాణ సర్కారు మెడలు వంచడం పెద్ద లెక్క కాదన్నారు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట హార్టీకల్చర్ విద్యార్థులను రేవంత్ పరామర్శించారు. హార్టికల్చర్ విద్యార్థుల న్యాయ బద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పెడచెవినపెడుతోందని విమర్శించారు. ఎన్నో రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా అర్థరాత్రి అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు. తెలంగాణా సాధనలో విద్యార్ధులు కీలక పాత్ర పోశించారని చెప్పారు. తెలంగాణ సాధించుకున్న విద్యార్థులు ప్రభుత్వం మెడలు వంచడం పెద్ద సమస్య కాదన్నారు. రేపటి నుండి అందరు విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో క్లాసులకు హాజరుకావాలి.. నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వ విధానాలకు నిరసన తెలపాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. విద్యార్థులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు రేవంత్.
