Asianet News TeluguAsianet News Telugu

కేటిఆర్ అసలు పేరు ఏంటో చెప్పిన రేవంత్

  • చిన్ననాటి విషయాలు సేకరించి చెప్పిన రేవంత్
  • తనకు టికెట్ రావాలని కొడుకు పేరు మార్చుకున్న కేసిఆర్
  • కీలక విషయాలు వెల్లడించిన రేవంత్
Revanth reveals ktr s original name

టిడిపి తెలంగాణ నేత రేవంత్ రెడ్డి సిఎం కేసిఆర్ పై మరోసారి తిట్ల పురాణం అందుకున్నారు. నిన్న కేసిఆర్ కోదండరాం ను తిట్టిన తరహాలోనే అంతకంటే ఎక్కువ ఘాటుగా తిట్ల వర్షం కురిపించారు. అయితే ఈ సందర్భంగా చాలా ఆసక్తికరమైన విషయాలను కూడా రేవంత్ వెల్లడించారు. అందులో కీలకమైనది కేటిఆర్ అసలు పేరు. దాని మీద రేవంత్ ఏమన్నారో ఇక్కడ చదవండి.

కేటిఆర్ అసలు పేరు అజయ్. అప్పట్లో కేసిఆర్ టిడిపిలో ఉండే. తనకు టికెట్ రావాలన్న ఉద్దేశంతో అజయ్ అనే పేరును మార్చిండు కేసిఆర్. అజయ్ పేరును కేటిఆర్ గా మార్చిన దౌర్భాగ్యుడు కేసిఆర్ అని విమర్శించారు రేవంత్. నాడు ఎన్టీఆర్ టికెట్ ఇస్తడో ఇయ్యడో అన్న భయంతో తన కొడుకుకు తారక రామారావు అని పెట్టుకుని టికెట్ కొట్టేశాడని ఎద్దేవా చేశారు.

నాడు కొడుకు పేరును అజయ్ నుంచి కేటిఆర్ గా మార్చిన కేసిఆర్ నేడు మాత్రం కొడుకును సిఎం చేయడం కోసం ఉన్న సచివాలయం కూలగొట్టి కొత్త సచివాలయం కట్టేందుకు ఆరాటపడుతున్నాడని విమర్శించారు.

ఎవడో జాతకాలు చెప్పేటోడి మాటలు విని ఉన్న సచివాలయం కూలగొట్టి కొత్తది కడతా అని సిఎం ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటి వరకు 16 మంది సిఎంల కొడుకులెవరూ సిఎం కాలేదు కాబట్టి సచివాలయం వాస్తు దోషం ఉందని కేసిఆర్ భావించడం మూర్ఖత్వం కాదా అని ప్రశ్నించారు. జాతకాలు చెప్పేవాడి మాటలు విని కొత్త సచివాలయం కడితే నీ కొడుకు సిఎం అయితడా అని నిలదీశారు. నీకొడుకు రాత్రిళ్లు ఇంటికి రాకుండా సినిమా వాళ్ల పొంట తిరుగుతుండని బాధపడే కేసిఆర్, కొత్త సచివాలయం కడితే మాత్రం బుద్ధిగా ఉంటడని ఎట్లా అనుకుంటాడు అని ప్రశ్నించారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/xCrZZ9

 

Follow Us:
Download App:
  • android
  • ios