Asianet News TeluguAsianet News Telugu

REVANTH REDDY: బొగ్గు గ‌నుల వేలంపై మోడీకి బ‌హిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

REVANTH REDDY: సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బ్లాకులను వేలం వేయడానికి  కేంద్ర‌ బొగ్గు మంత్రిత్వ శాఖ ప్ర‌యత్నిస్తున్న‌ది.  ఆ ప్ర‌య‌త్నాన్ని వెంట‌నే ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్ర‌ధాని మోడీకి టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ  రాశారు. ఎంతోమంది కార్మికుల‌కు అండ‌గా నిలుస్తోన్న ఈ కంపెనీ అండ‌గా నిలిచింద‌ని తెలిపారు. వేలం వేయాల‌నుకుంటున్నా ఆ బ్లాకుల‌ను కూడా  సింగ‌రేణీ కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ ( SCCL )కి అప్ప‌జెప్పాల‌ని విన్న‌వించుకున్నారు. 
 

REVANTH REDDY urges PM Narendra Modi to stop auction of Singareni coal blocks
Author
Hyderabad, First Published Dec 11, 2021, 3:06 PM IST

REVANTH REDDY: ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ  రాశారు. సింగరేణి కాల‌రీస్ లోని నాలుగు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు జ‌రుగుతోన్న ప్ర‌యత్నాల‌ను విర‌మించుకోవాల‌ని ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి కోరారు. సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బ్లాకులను వేలం వేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్ర‌యత్నిస్తోంద‌నీ, ఆ ప్ర‌య‌త్నాన్ని వెంట‌నే ఉపసంహరించుకోవాలని అన్నారు. ఆ బ్లాకుల‌ను కూడా  సింగ‌రేణీ కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ ( SCCL )కి అప్ప‌జెప్పాల‌ని విన్న‌వించుకున్నారు. 
 
బొగ్గు విక్ర‌యం కోసం , బొగ్గు గ‌నుల వేలం కోసం మూడ‌వ విడ‌త‌లో సింగ‌రేణి కాల‌రీస్ లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని,  భారత ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖ (MoC) ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్ర‌ధాని దృష్టికి తీసుకు వెళ్లారు రేవంత్ రెడ్డి.  దేశంలోని ప‌లు ప‌వ‌ర్ ప్లాంట్స్ తీవ్ర‌మైన బొగ్గుకొర‌త ను ఎదుర్కొంటున్నాయ‌నీ, కానీ, తెలంగాణ‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లలో అవసరాలకు తగ్గట్టుగా నిల్వలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు.

Read also:  https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-health-minister-harish-rao-visit-to-gandhi-hospital-r3y2ix


సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నుండి తగినంత బొగ్గు సరఫరా కారణంగా మాత్రమే ఇది సాధ్యమైందని..   సింగరేణి సంస్థ 132 ఏళ్లుగా ఎంతో నిబద్దతతో దేశానికి సేవ చేస్తుందని, SCCL అనేది 51:49 ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌తో తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం యొక్క జాయింట్ వెంచర్ అని గుర్తు చేశారు. ఈ సంస్థ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెస్, డివిడెండ్ల ద్వారా వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఇది ఇప్పుడు 45 గనుల నుండి బొగ్గును ఉత్పత్తి చేస్తోంద‌ని 1200 MW (2X600) MW పవర్ ప్లాంట్‌ను నిర్వహిస్తోందని ప్ర‌ధానికి తెలిపారు.
 

Read also: https://telugu.asianetnews.com/andhra-pradesh/chandrababu-serious-comments-on-ys-jagan-r3xypq

గనులు/మైనింగ్ లీజుల పొడిగింపు అనేది అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం మరియు నిల్వల పరిరక్షణ కోసం మాత్రమే సాంకేతికంగా సాధ్యమవుతుంది. ఇప్పటికే ఉన్న గనుల విస్తరణ ఈ 4 బొగ్గు బ్లాకుల పరిధిలోకి వస్తుంది. వీటి నుంచి కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించిందని, అలాంటి .. 1) కోయగూడెం బ్లాక్ – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 2) సత్తుపల్లి బ్లాక్- ఖమ్మం జిల్లా, 3) శ్రావణపల్లి - మంచిర్యాల జిల్లా, 4) కళ్యాణి బ్లాక్ – మంచిర్యాల బ్లాకులను వేలంపాట ద్వారా ప్రైవేటీకరించాలని  భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ  నిర్ణ‌యించింది.

ఇటీవ‌ల బొగ్గు మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ అన్ని వాటాదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంద‌ని తెలిపారు. బొగ్గు త‌ర‌లింపు కోసం..సత్తుపల్లి నుంచి కోయగూడెం వరకు రైల్వే లైన్‌ వేయడానికి సుమారు రూ.750 కోట్ల వ్య‌యమ‌వుతుంద‌నీ, అలాగే.. ప్రాంతంలో అన్వేషణలో సుమారు 70 కోట్లు వ్య‌యమ‌తోంద‌ని, దీంతో  SCCLకి భారీ నష్టం వాటిల్లుతుందని వివ‌రించారు. 

Read Also: https://telugu.asianetnews.com/telangana/balkasuman-fires-on-auction-of-coal-blocks-in-singareni-r3y11y

ఈ సంస్థ వేలాది మంది కార్మికులకు ఉపాధి కలిగిస్తోంద‌నీ, ఒక వేళ ప్ర‌వేట్ ప‌ర‌మైతే.. గని కార్మికుల  భవిష్యత్తు ప్ర‌శ్నార్థ‌కమ‌వుతోంద‌ని,  కాబ‌ట్టి ఈ విష‌యంలో మరోసారి పున‌రాలోచించాల‌ని ప్ర‌ధాని కోరారు.  బొగ్గు బ్లాకులను వేలం వేయడాని వ్య‌తిరేకిస్తూ సింగ‌రేణి కార్మికులు  గురువారం నుండి మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చార‌ని, కోవిడ్ సమయంలో ఎంతో మంది కార్మికులకు ఈ సంస్థ అండ‌గా నిలిచింద‌ని తెలిపారు.  కాబట్టి, MMDR చట్టం, 1957లోని సెక్షన్ 1 IA కింద పేర్కొన్న నాలుగు బ్లాక్‌ల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని ప్ర‌ధానిని కోరారు రేవంత్ రెడ్డి. మ‌రీ  ఈ లేఖ‌పై ప్ర‌ధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios