Asianet News TeluguAsianet News Telugu

మాట తప్పారు, మడమ తిప్పారు: ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై జగన్ పై బాబు ఫైర్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను  జగన్ సర్కార్ విస్మరించిందన్నారు. శనివారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

Chandrababu  serious comments on Ys Jagan
Author
Guntur, First Published Dec 11, 2021, 1:40 PM IST

అమరావతి: ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీల విషయంలో జగన్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో  ఎన్నికల ముందు ఇచ్చిన మాటను  అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కారన్నారు. శనివారం నాడు  టీడీపీ చీఫ్ Chandrababu అమరావతిలో మీడియాతో మాట్లాడారు.ప్రత్యేక హోదాపై వైసీపీ ఎందుకు పోరాటం చేయడం లేదని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. Special stutus పై ycp కి చిత్తశుద్ది ఉంటే ఆ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే తమ పార్టీ ఎంపీలంతా కూడా రాజీనామాలు చేస్తారని చంద్రబాబు తేల్చి చెప్పారు.

 ప్రత్యేక హోదాపై Ys Jagan మాట తప్పారని చంద్రబాబు విమర్శించారు.ప్రత్యేక హోదా ముగిసన అధ్యాయమని మరోసారి పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటించినా కూడా వైసీపీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని... ప్రత్యేక హోదా కోసం కేంద్రం నుండి వైదొలిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ప్రత్యేక హోదాతో పాటుVisakha steel facotory, , రైల్వే జోన్ అంశాలపై  ప్రజల్లో ఉన్న అసంతృప్తి నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. 

also read:జగన్ ను చంపి అధికారంలోకి రావాలనే కుట్ర: టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలనం

విశాఖపట్టణానికి రైల్వే జోన్ ఇవ్వాలనే డిమాండ్ ను వైసీపీ విస్మరించిందని ఆయన ఆరోపించారు.రైల్వే జోన్ అంశంపై గతంలో జగన్ ఇచ్చిన హామీలను మీడియా సమావేశంలో చంద్రబాబు విన్పించారు. విశాఖ రైల్వే జోన్  తమ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ప్రకటించినా కూడా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదని ఆయన విమర్శించారు.   విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోలేకపోతున్నారన్నారు.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజల సెంటిమెంట్ అని ఆయన గుర్తు చేశారు. గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలను అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో  దీన్ని అడ్డుకొన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. పోస్కో ప్రతినిధులతో మాట్లాడారా లేదో చెప్పాలని ఆయన కోరారు. పోస్కో ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత విశాఖ ఉద్యమాన్ని నీరుగార్చారని చంద్రబాబు జగన్ పై విమర్శలు గుప్పించారు. 

ఎన్నికల ముందు మాట తప్పను, మడమ తిప్పను అంటూ  వైసీపీ నేతలు జగన్ గురించి ఊదరగొట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మాట తప్పి మడమ తిప్పారని చంద్రబాబునాయుడు జగన్ పై విమర్శలు చేశారురాష్ట్రంలో ఏదైనా సమస్య తెరమీదికి వచ్చిన సమయంలో ఆ సమస్య నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసులు బనాయించి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios