‘బీజేపీ ఎంపీల లాగులు ఊడదీసి కొట్టాలి’.. సింగరేణిలో బొగ్గు బ్లాక్ ల వేలంపై బాల్కాసుమన్ ఫైర్...

బ్లాక్ ల వేలం వేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా మోడీ కి లేఖ రాశారు. అయినా ఉలుకు పలుకు లేదు. గుజరాత్ లో బ్లాక్ లు వేయకుండా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కోల్ ఇండియాకు కేటాయించింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కనుకే కేంద్రం అక్కడి సీఎం చెప్పినట్టు విన్నది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కనుకే బీజేపీ కోల్ బ్లాక్ లను ప్రైవేట్ కంపెనీ లకు కట్టబెట్టాలని చూస్తున్నది.

Balkasuman fires on auction of coal blocks in Singareni

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తెలంగాణపై అన్ని అంశాల్లో కక్ష కట్టాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. రైతులను ఇబ్బంది పెట్టిన కేంద్రం ఇపుడు సింగరేణి కార్మికులను వేధిస్తోందన్నారు. సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ Balka Suman, పియూసీ చైర్మన్ A. Jeevan Reddy, ఎమ్మెల్సీ Yegge Mallesham,  trslp officeలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఈ ప్రెస్ మీట్ లో బాల్కా సుమన్ మాట్లాడుతూ...

ఏ సూచికల్లో చూసినా Singareni టాప్ ప్రభుత్వ రంగ సంస్థగా నిలుస్తోంది. వంద శాతానికి పైగా లాభాలను సాధిస్తున్న సంస్థ సింగరేణి. లాభాల్లో ఉన్న సింగరేణిపై కేంద్రం కుట్ర పన్ని Auction of coal blocksకి దిగింది. మూడు రోజుల సింగరేణి సమ్మెలో మేం పాల్గొని మద్దతు ఇచ్చాం. 

బ్లాక్ ల వేలం వేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా మోడీ కి లేఖ రాశారు. అయినా ఉలుకు పలుకు లేదు. గుజరాత్ లో బ్లాక్ లు వేయకుండా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కోల్ ఇండియాకు కేటాయించింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కనుకే కేంద్రం అక్కడి సీఎం చెప్పినట్టు విన్నది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కనుకే బీజేపీ కోల్ బ్లాక్ లను ప్రైవేట్ కంపెనీ లకు కట్టబెట్టాలని చూస్తున్నది.

ఒడిశా, ఝార్ఖండ్ సీఎం లు తమ రాష్ట్రాల్లో బ్లాక్ ల వేలాన్ని ఆపమంటే పీఎం ఆపారు. కేసీఆర్ లేఖ రాసినా మోడీ స్పందించడం లేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది. బీజేపీ తెలంగాణపై కక్ష కట్టింది. తెలంగాణ సమాజం గమనించాలి. ధాన్యం సేకరణ విషయంలో రైతులను ముంచిన బీజేపీ ఇపుడు సింగరేణి విషయంలో కార్మికులను ముంచుతోంది.

మోడీ అద్వానీని ముంచి తన మిత్రుడైన ఆదానీ ఆస్తులను పెంచే కుట్ర చేస్తున్నాడు.కోల్ బ్లాక్ లను ఆదానీ కి కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. రహదారుల విషయంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని బీజేపీ ఎంపీలకు లేదు. కేంద్రమంత్రి సహా తెలంగాణ ఎంపీలకు తోలు మందమైంది.

Singareni coal wells వైపు వస్తే కార్మికులు BJP MPల లాగులు ఊడదీసి కొట్టాలి. మూడు రోజులు కార్మికులు సమ్మె చేసినా బీజేపీ నేతలు ఉలకరు, పలకరు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడని బీజేపీ నేతలను సింగరేణి ప్రాంత యువత నిలదీయాలి అన్నారు. కార్మికలోకం బీజపై తిరగబడాలి.

బీజేపీ నేతలు ఢిల్లీలో దావత్ లు బంద్ చేసి సింగరేణి కార్మికులతో మాట్లాడాలి. మోడీతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరు. సింగరేణి పై మాట్లాడకుంటె బీజేపీ భరతం పడతాం. క్రమ పద్దతిలో కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రతీ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నకుట్రలను తెలంగాణ సమాజం చేధించాలి.

సింగరేణిని ముంచే కుట్ర: కేంద్రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్

పంజాబ్ లో రైతులు బీజేపీ ని గ్రామాల్లోకి రానివ్వడం లేదు .తన్ని తరి మేస్తున్నారు.సింగరేణి బొగ్గు బ్లాక్ ల వేలం ఆపకుంటే తెలంగాణ గ్రామాల్లో కూడా బీజేపీ కి అదే పరిస్థితి ఎదురవుతుంది. సింగరేణి కార్మికుల వెంటే టీఆర్ఎస్ ఉంటుంది. సమ్మె ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.

సింగరేణి కోసం మా ప్రభుత్వం చేసిన పనులు మరెవ్వరూ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు సింగరేణికి ఎం చేయలేదు. ఇపుడు మాయ మాటలు చెబుతోంది. తెలంగాణకు బొగ్గు దక్కకుండా చేసి విద్యుత్ రంగాన్ని దెబ్బ తీయాలన్నది బీజేపీ కుట్ర అని విరుచుకుపడ్డారు. 

పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

కర్షకులు ,కార్మికులతో పెట్టుకుంటున్న బీజేపీ కి రోజులు దగ్గర పడ్డాయి. బీజేపీ తెలంగాణ పాలిట శిఖండి పార్టీగా మారింది. నలుగురు బీజేపీ ఎంపీ లు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కాదు మెంబెర్స్ ఆఫ్ ఫ్రాడ్ క్లబ్, ఈ బీజేపీ ఫ్రాడ్ ఎంపీలతో తెలంగాణ కు నష్టమే తప్ప లాభం లేదు. ప్రభుత్వ రంగ భారత్ ను ప్రైవేట్ రంగ భారత్ గా బీజేపీ మార్చింది.

బీజేపీ గుజరాత్ బేరగాళ్ల పార్టీ గా మారింది. రైతులకు సీఎం కేసీఆర్ 3 లక్షల కోట్ల రూపాయల మేర ఇప్పటి వరకు లాభం చేకూర్చే పని చేస్తే కేంద్రం వారి నడ్డి విరుస్తోంది.దౌర్భాగ్యపు బీజేపీ నేతలను ఎంపీ లుగా ఎన్నుకున్నందుకు ప్రజలు భాధ పడుతున్నారు. సింగరేణి బ్లాక్ ల వేలాన్ని బీజేపీ ఎంపీ లు అడ్డుకుని తమ నిజాయితీని చాటుకోవాలి అన్నారు.

బీజేపీ ఎంపీలను రైతులు,కర్షకులు ఉరికించి కొట్టడం ఖాయం. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఉద్యోగాలకు ఎసరు పెట్టే కుట్ర బీజేపీది, కొందరు బడా వ్యాపారులకు ప్రభుత్వ ఆస్థులను దోచి పెట్టే కుట్ర జరుగుతోంది. బీజేపీ ఎంపీ లకు దమ్ముంటే తెలంగాణ రైతుల కోసం ఓ 20 వేల కోట్ల రూపాయలను కేంద్రం నుంచి తేవాలి. బీజేపీ కుట్రలను తెలంగాణ సమాజం తప్పక తిప్పి కొడుతుంది.

కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి మొండిగా పని చేస్తుంటే బీజేపీ తొండి రాజకీయం తో అడ్డుపడుతోంది. బీజేపీ ఆటలు సాగనివ్వం. బీజేపీ కార్యాలయానికి భవిష్యత్ లో టు లెట్ బోర్డు లు తగిలించాల్సిందే. మోసగాళ్లని దేశం దాటించింది బీజేపీ నేతలే. కేసీఆర్ అంటే ఓ నమ్మకం బీజేపీ అంటే అమ్మకం. బీజేపీ సెల్లర్స్ పార్టీ గా మారి పోయింది. దేశాన్ని నిరుద్యోగ భారత్ గా మార్చిన బీజేపీ కి యువత బుద్ది చెబుతుంది అన్నారు. 

ఎమ్మెల్సీ యెగ్గే మల్లేషం మాట్లాడుతూ.. 
సీఎం కెసీఆర్ తెలంగాణ కోసం తపన పడుతుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. అన్ని రంగాలను సొంత వనరులతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ది. పని చేస్తున్న కేసీఆర్ కు సహకరించకుండా బీజేపీ నేతలు తోండాట ఆడుతున్నారు. బీజేపీ కి తెలంగాణ లో పుట్టగతులు ఉండవు. పేదలకు అండగా నిలవని బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios