Revanth Reddy : ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తనను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయి జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయిగా ఉన్నా జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆనాడే తాను సరెండర్ అయి అన్ని విషయాలు బైటపెడదామని అనుకున్నానని... కానీ రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆగిపోయానని మత్తయ్య తెలిపారు. స్వయంగా రేవంత్ భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేసి సరెండర్ కావద్దని... అయితే తన భర్త ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నాడని చెప్పినట్లు మత్తయ్య వెల్లడించారు. ఏసిబి ఆఫీసులోనే సూసైడ్ చేసుకుంటానని రేవంత్ రెడ్డి బెదిరించడంతోనే సరెండర్ విషయంలో వెనక్కి తగ్గినట్లు మత్తయ్య తెలిపారు.

నేను సరెండర్ అయ్యుంటే ఏం జరిగేదంటే…

ఒకవేళ తాను ఆనాడు సరెండర్ అయ్యుంటే రేవంత్ రెడ్డికి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలేదని మత్తయ్య అన్నారు. అతడిని సస్పెండ్ చేయడానికి టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఓ నోట్ రెడీ చేసి పెట్టుకున్నారని తెలిసిందన్నారు. ఇదే జరిగితే రాజకీయ జీవితం సమాప్తం అవుతుందనే తనను సరెండర్ కాకుండా రేవంత్ అడ్డుకున్నారని మత్తయ్య తెలిపారు.

బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు

ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికే టిడిపి, కాంగ్రెస్ లు కుమ్మక్కయి కుట్రలు చేశాయని మత్తయ్య ఆరోపించారు. తనకు ఐదు కోట్లకు యాబై లక్షల కమీషన్ ఇస్తానంటే బుద్ది గడ్డితిని ఇందులో భాగమయ్యాయని మత్తయ్య తెలిపారు. వారిమాటలు విన్నందుకు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా దెబ్బతిన్నానని... ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మత్తయ్య తెలిపారు.

Scroll to load tweet…