Revanth Reddy: 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 

Revanth Reddy: తెలంగాణలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అంతకు ముందు పోలీసు బలగాలు కవాతు నిర్వహించగా సీఎం గౌరవ వందనం స్వీకరించారు. స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ .. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మనకు స్వేచ్ఛను ఇచ్చామనీ, వారి ఆశయాలను నెరవేర్చడం మనందరి బాధ్యతని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దివంగత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేశం చేశారని అన్నారు.

అప్పటి ప్రధాని నెహ్రూ కేవలం మాటలకే పరిమితం కాకుండా, పటిష్ట భారత్ కోసం అనేక సాహసోపేత చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. అహింసా మార్గంలో స్వాతంత్ర్య సంగ్రామాన్ని గెలిచామని, ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని అన్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశాన్ని ఏకం చేసిందని, ఆ మాటలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని, నేడు భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని తెలిపారు.

నేటీ కాంగ్రెస్ ప్రభుత్వం వారి స్పూర్తితో సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతోందని, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడే నిర్ణయాలు తీసుకుంటూ, పేదల సంక్షేమంలో కొత్త చరిత్ర సృష్టిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అన్నారు. తాము అధికారంలోకి రాగానే సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేసామని, చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోని కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఓవైపు ప్రపంచ దేశాలతో పోటీపడేలా లక్ష్యాలను నిర్ణయించుకొని, మరోవైపు పేదల ఆకాంక్షలను తీర్చడానికి సంక్షేమ ఫలాలను అందజేస్తున్నామని ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ద్విముఖ పరిపాలన విధానాన్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. కేవలం 20 నెలల పాలల్లోనే తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలియజేశారు. అలాగే దేశంలో మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ప్రకటించారు. యువత శక్తికి ప్రతీక.. కానీ గడిచిన 10 ఏళ్లలో వారిని మత్తు పదార్థాలకు బానిసగా చేసి, ఆనాటి పాలకులను ప్రశ్నించకుండా కుట్ర జరిగిందని ఏం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అలాంటి చర్యలకు పాల్పడి చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై కూడా సేమ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ పోరాటమే నీటి కోసం జరిగిందని, కృష్ణ, గోదావరి జలాలలో తమకు రావాల్సిన వాటా కోసం పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎవరి ఒత్తిడికి లొంగేది లేదని స్పష్టం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తాను నిలబడి కృష్ణ గోదావరి జనాల కోసం కొట్లాడతానని హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం ఎవరి ఒత్తిళ్లకు భయపడే లేదని, ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తామని, ఎవరు ఎన్ని విష ప్రచారాలను చేసిన వాటిని తిప్పి కొట్టే బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలని సీఎం సి రేవంత్ రెడ్డి మనవి చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులోని లోటుపాట్లను చూస్తూ గత ప్రభుత్వ పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటాం అని అన్నారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు. 

Hon'ble CM Revanth Reddy participates in Independence Day celebrations at Golconda Fort, Hyderabad

ఎస్ ఎల్ బి సి, పాలమూరు, కృష్ణ దిండి ప్రాజెక్టులను పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడతామని హామీ ఇచ్చారు.