ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంతో ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా మళ్లీ సీఎం కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావుకు మంత్రిమండలిలో స్థానం కల్పించరని అభిప్రాయపడ్డారు. హరీష్ కు మంత్రి పదవి రాకపోవడానికి కారణాలను కూడా రేవంత్ వివరించారు. 

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిడ్ మానేరు, గౌరెల్లి, తోట పల్లి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ వెయ్యికోట్లు దోచుకున్నాడని రేవంత్ ఆరోపించారు. అలా సంపాదించిన డబ్బులను కేసీఆర్ కు తెలియకుండా అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ పంచిపెట్టారని తెలపారు. ఇలా తన వర్గానికి చెందిన దాదాపు 30 మందికి హరీష్ డబ్బులు పంచారని రేవంత్ ఆరోపించారు. 

అంతేకాకుండా ఎన్నికల సమయంలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో కూడా హరీష్ ఫోన్ లో టచ్ లో వున్నారు. ఈ విషయాలన్ని కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో అప్పటినుండి హరీష్ ను దూరం పెట్టారు. ఈ కారణాల వల్లే హరీష్ కు మంత్రి పదవి కూడా లభించడంలేదని రేవంత్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు 

పాక్‌తో యుద్దం...సార్వత్రిక ఎన్నికలు డౌటే: రేవంత్ రెడ్డి