తెలంగాణ బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉండదని అన్నారు.
తెలంగాణ బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉండదని అన్నారు. ఇదే విషయంలో రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పారని ప్రస్తావించారు. మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ ఈ కామెంట్స్ చేశారు. తాను టీపీసీసీ చీఫ్‌గా ఉన్నంతకాలం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య పొత్తు ఉండదని స్పష్టం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు 80 సీట్లు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల మధ్య ట్రయాంగిల్ లవ్ ఉందన్నారు.
ఈసారి కేసీఆర్ 25 సీట్లకే పరిమితం అవుతుందని.. బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని అన్నారు. బీజేపీతో కేసీఆర్ కొట్లాడినట్టుగా నటిస్తూ కాంగ్రెస్‌ను మింగేస్తున్నారని అన్నారు. ధృతరాష్ట్ర కౌగిలికి సిద్దంగా లేమని అన్నారు.
అయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రాజకీయంగా తమకు తిరుగుండదని బీజేపీ భావిస్తుందని జానారెడ్డి చెప్పారు.
ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
అయితే జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో సైతం పలు రకాల చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది.
