వివాదాస్పద ఎన్ కన్వెన్షన్ పై రేవంత్ ప్రశ్నచెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ విజయవంతంగా అమలవుతోందని జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ కాకతీయపై ఆయన వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చెరువులను కబ్జా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొందని, అయితే వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆరోపించారు. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్
హైటెక్ సిటీ సమీపంలో ఉండే తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు.
స్వయంగా జీహెచ్ఎంసి సర్వే చేసి నాగార్జున కబ్జా చేసిన విషయాన్ని ధృవీకరించారని పేర్కొన్నారు. నాగార్జున కూడా దీనిపై స్పందించారని గుర్తు చేశారు.
