తెలంగాణ కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ: దాసోజు శ్రవణ్

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని బీఆర్ఎస్ నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్‌ కొనియాడారు. "సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కాబోతున్నారు. కాంగ్రెస్ డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి గ్యాంగ్ తెలంగాణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నా తెలంగాణ ప్రజలు వారికి బలైపోరని" అన్నారు.
 

Revanth Reddy-led Telangana Congress sinking boat: BRS leader Sravan Dasoju RMA

BRS leader Sravan Dasoju: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కుడు దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. "సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కాబోతున్నారు. కాంగ్రెస్ డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి గ్యాంగ్ తెలంగాణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నా తెలంగాణ ప్రజలు వారికి బలైపోరని" అన్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని భావించార‌ని, కానీ 2018 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎంతమంది పార్టీని వీడారని ప్రశ్నించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది చేరార‌ని ప్ర‌శ్నిస్తూ.. కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే చేరార‌నీ, అది కూడా త‌మ పార్టీ బ‌హిష్క‌రించిన త‌ర్వాత‌ని తెలిపారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఇద్దరు నాయ‌కుల‌పై ఆయన స్పందిస్తూ.. 'టికెట్ ఇచ్చినప్పుడు ఒకరు (జూపల్లి కృష్ణారావు) ఓడిపోయారనీ, మరొకరికి టికెట్ ఇవ్వకుండా (పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి) పక్కన పెట్టారని ఆరోపించారు. ఈ ఇద్దరు నేతలు పార్టీలో చేరడంతో తాను శక్తిమంతుడవుతానని రేవంత్ అనుకుంటే అది ఆయన మూర్ఖత్వమే"నన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా 48 మంది కార్పొరేటర్లకు గాను కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగారు. సొంత నియోజకవర్గ కార్పొరేటర్ సీటు కూడా గెలవలేని ఆయన తెలంగాణను ఎలా గెలుచుకోగలరని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తూ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ.. ఉప ఎన్నికలను పరిశీలిస్తే మునుగోడులో కాంగ్రెస్ కు 3000 వేల ఓట్లు వచ్చాయన్నారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మహిళను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపినప్పుడు అదే వ్యక్తికి తక్కువ ఓట్లు వచ్చాయ‌ని తెలిపారు. అదే రేవంత్ రెడ్డి చరిష్మా అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తూటాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవన్నారు. ఆయన ఎవరికీ స్ఫూర్తిగా నిలవలేని నాయకుడని పేర్కొన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై దాసోజు శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ.. "కర్ణాటకలో నాయకత్వ మార్పుతో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. బలహీన నాయకత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడింద‌ని" అన్నారు. తెలంగాణలో కేసీఆర్ లాంటి బలమైన నాయకుడిపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కాబోతున్నారు. డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి గ్యాంగ్ తెలంగాణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నా తెలంగాణ ప్రజలు వారికి బలైపోరని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios