Revanth Reddy: ప్రజా పాలన.. ఏయే పథకాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు?

ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కాలంలోనే ప్రజలు మహాలక్ష్మీ, గృహలక్ష్మీ, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 

revanth reddy govt orders praja palana, five scheme applications to be taken kms

ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజా పాలన చేసి పథకాలను సమీక్షించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాల కోసం ఈ ప్రజా పాలన కాలంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్లకు, ఇతర అధికారులకూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ ఆరు పథకాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్బంలో ఆధార్, రేషన్ కార్డులు, ఇతర పత్రాల వివరాలు నమోదు చేయాలి. ఒక వేళ రేషన్ కార్డు లేకుంటే.. రేషన్ కార్డు లేదని మెన్షన్ చేయాలి. అధికారులు పరిశీలన చేసి రేషన్ కార్డులను అర్హులకు పంపిణీ చేస్తారు.

ఈ ఐదు పథకాలకు ఉమ్మడిగా.. 

మహాలక్ష్మీ పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా పథకాలకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు ఆ డేటాను కంప్యూటరీకరణ చేసుకుంటారు. ఆ తర్వాత విధిగా దరఖాస్తుకు సంబంధించిన రశీదును సదరు దరఖాస్తుదారుకు అందిస్తారు. ఈ ఐదు పథకాలను ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే దరఖాస్తులో అవసరమున్న వాటిని పేర్కొనవచ్చు.

Also Read: YS Sharmila: నారా లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్‌లు.. ఏపీలో కలిసే ఫైట్?

గ్రామాల్లో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే బందోబస్తుతోపాటు, మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios