Asianet News TeluguAsianet News Telugu

Revanth Reddy: కలెక్టర్లు రాజకీయ అవతారం ఎత్తారు.. కాంగ్రెస్ ధర్నాలకు ఎందుకు అనుమతివ్వడం లేదు.. రేవంత్ రెడ్డి

వరి కొనుగోళ్లపై (Paddy procurement) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్.. తమ ప్రజా చైతన్య యాత్రను (congress praja chaitanya yatra) రద్దు చేయలేదని, వాయిదా వేశామని చెప్పారు.

revanth reddy fires on trs and bjp over paddy procurement
Author
Hyderabad, First Published Nov 14, 2021, 2:01 PM IST

వరి కొనుగోళ్లపై (Paddy procurement) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ మాట నిలబెట్టుకోకపోతే ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరించారు. ఆదివారం గాంధీ భవన్​లో(Gandhi Bhavan)  సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో (mallu bhatti vikramarka) కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ధాన్యం కొనుగోళ్ల సమస్యకు పరిష్కారం చూపడం లేదని అన్నారు. ప్రతి విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

తమ ప్రజా చైతన్య యాత్రను (congress praja chaitanya yatra) రద్దు చేయలేదని, వాయిదా వేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కలెక్టర్లు రాజకీయ అవతారం ఎత్తారని ఆరోపించారు. టీఆర్ఎస్‌ ధర్నాలకు అనుమతిచ్చి..కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నిబంధనలు తమ పార్టీకేనా? టీఆర్ఎస్, బీజేపీలకు ఉండవా? అని నిలదీశారు. బీజేపీ, టిఆర్ఎస్‌లు కలిసి హైడ్రామాకు తెరతీశారని ఆరోపించారు. 

వడ్లు కొనేందుకు రూ. 10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాల్లో ముఖ్యమంత్రి పాల్గొనలేదని.. ఎందుకంటే ఆయన ఫామ్​హౌజ్​లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు దీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. వడ్లు కొనలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు.  ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందేనని Revanth Reddy డిమాండ్ చేశారు.

Also read: ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పలేదుగా... కానీ బాయిల్డ్ రైస్‌ని : టీఆర్ఎస్ ధర్నాలకు కిషన్ రెడ్డి కౌంటర్

బాలల దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం ఈ దేశ ప్రజలకు ఒక పండుగని అన్నారు. దేశ స్వాతత్ర్య సమరంలో ఎలాంటి పాత్ర లేని వారిని.. నేడు దేశ భక్తులుగా చూపిస్తున్నారని విమర్శించారు. నేటి యువతకు తప్పుడు చరిత్రను చూపిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది చరిత్రను వక్రీకరిస్తున్నారని.. దేశం కోసం త్యాగం చేసిన నాయకులను అవమాన పరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. 

ALso Read:రైతులను మోసం చేస్తే బాగుపడరు.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్..!

మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హుజురాబాద్‌ ఫలితంపై ఢిల్లీ జరిగిన సమీక్షకు సంబంధించి పలు పత్రికల్లో వచ్చిన కథనాలు అవాస్తమని అన్నారు. నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో చెప్పింది మాత్రమే నిజమని అన్నారు. ఇటువంటి కథనలనాలను జనాలు నమ్మవద్దని కోరారు. మీడియా మిత్రులు సహకరించాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios