Asianet News TeluguAsianet News Telugu

రైతులను మోసం చేస్తే బాగుపడరు.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్..!

తమను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలను రైతులు శిక్షించారని చెప్పారు. మూడు నల్ల చట్టాలతో రైతుల మెడపై కత్తి వేలాడుతున్నదని, రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Telangana Minister Niranjan reddy Fire on Central Govt
Author
Hyderabad, First Published Nov 13, 2021, 4:44 PM IST

రైతులను మోసం చేసిన వారెవరూ బాగుడపలేదని.. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని చెప్పారు. ధాన్యం సేకరణపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఒకటి చెబుతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మరొకటి చెబుతున్నారని, ఇది దివాలాకోరు రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన నిరసన విజయవంతం చేసినందుకు తెలంగాణ రైతులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమయ్యాయని చెప్పారు. తమను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలను రైతులు శిక్షించారని చెప్పారు. మూడు నల్ల చట్టాలతో రైతుల మెడపై కత్తి వేలాడుతున్నదని, రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దేశంలోని 108 కోట్ల జనాభాలో 20-22 కోట్ల మందికి ఇప్పటికీ తిండిగింజలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోని ధాన్యం నిల్వలను పేదలకు పంచవచ్చని వెల్లడించారు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. సామాన్యుల డబ్బులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని తాము కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం మాత్రం వంట నూనెల దిగుమతి కోసం రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో నూనెగింజల ఉత్పత్తికి కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పంట మార్పిడికి అవసరమైన ప్రోత్సాహకం అందించట్లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా పంట మార్పిడికి కేంద్రమే ఒక విధానాన్ని ప్రకటించించవచ్చని మంత్రి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios