తాండూరు సభలో రేవంత్ రెడ్డి రెచ్చిపోయిండు. తెలంగాణ సిఎం కేసిఆర్ పై తిట్ల భాష అందుకున్నడు. కాంగ్రెస్ లో చేరినప్పటినుంచి కొంచెం సంయమనం పాటించిన రేవంత్ ఇవాళ మళ్లీ టిడిపి రోజులను గుర్తు చేసిండు. నిన్న సిఎం కేసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై ఎలా ఘాటుగా తిట్ల వర్షం కురిపించారో అదే తరహాలో నేడు రేవంత్ కూడా కేసిఆర్ మీద విరుచుకుపడ్డారు. నిన్న చేవెళ్ల సభలో కేసిఆర్ కు కేసిఆర్ భాషలోనే సమాధానం చెప్పాలంటూ కార్యకర్తలందరితో ఆమోదం తీసుకున్న తెల్లారే రేవంత్ ఇలా రెచ్చిపోవడం కాంగ్రెస్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. రేవంత్ ఏం మాట్లాడారో కింద వీడియోలో చూడండి.