హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ప్రగతి భవన్  ముట్టడికి పోలీసుల కళ్లుగప్పి కాంగ్రెస్ నేతలు సోమవారం నాడు వచ్చారు. అయితే ప్రగతి భవన్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం నాడు ప్రగతి భవన్  ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా  కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.మరికొందరు నేతలను ఇంటి నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు రాత్రి నుండి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇంట్లో లేకుండా తప్పించుకొన్నారు.

రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల ఇళ్లలో పోలీసులు ఆదివారం నాడు రాత్రి నుండి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడ పోలీసులకు రేవంత్ రెడ్డి ఆచూకీ దొరకలేదు. రేవంత్ రెడ్డి కోసం పోలీసులు రాత్రి నుండి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, ఆయన పోలీసులకు దొరకలేదు.

సోమవారం నాడు ఉదయం కూడ పోలీసుల కళ్లుగప్పి రేవంత్ రెడ్డి బైక్ పై ప్రగతి భవన్ వద్దకు చేరుకొన్నాడు. ప్రగతి భవన్ వద్దకు  రేవంత్ రెడ్డి చేరుకోగానే ఆయనను పోలీసులు అడ్డుకొన్నారు. పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

అన్నంత పనే చేశారుగా: ప్రగతిభవన్ ను తాకిన రేవంత్ రెడ్డి, అరెస్ట్

రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని  ఆటోలో ప్రగతి భవన్ వద్దకు వచ్చారు. ఆటో దిగిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి పోలీసుల కళ్లుగప్పి హైద్రాబాద్ కు చేరుకొన్నాడు. హైద్రాబాద్ లో ఆటోలో జగ్గారెడ్డి ప్రగతి భవన్ వద్దకు చేరుకొన్నాడు. ప్రగతి భవన్ వద్దకు జగ్గారెడ్డి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాంగ్రెస్‌ నేతల హౌస్ అరెస్ట్, రేవంత్ రెడ్డి సహా కీలక నేతల కోసం పోలీసుల గాలింపు

ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేతలను నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తిప్పారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను వదిలిపెడితే మళ్లీ ప్రగతి భవన్ ముట్టడికి వస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తమ అదుపులోనే పోలీసులు ఉంచుకొంటున్నారు.

ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ స్వంతంగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

ప్రగతి భవన్ ముట్టడి.. బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత

మరో వైపు ఇవాళ్టి నుండి ఈ నెల 30వ తేదీ వరకు ఆర్టీసీ జేఎసీ, పలు రాజకీయపార్టీలు పలు కార్యక్రమాలను చేపట్టాయి.ఈ నెల 30వ తేదీన సకల జనుల సమరభేీరిని నిర్వహించనున్నారు.సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ విషయమై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.