రేవంత్ రెడ్డి అరెస్టు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. డ్రగ్స్ లొో ప్రధాన నిందుతులను ప్రభుత్వం తప్పించిందన్న రేవంత్ రెడ్డి. 

టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రధాన నేరస్థులను వదిలి డ్రగ్స్ భాధితులను మాత్రమే విచారిస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం తీరును ఆరోపిస్తూ .... తెలంగాణ‌లో మాదకద్రవ్యాల‌ను వెంటనే అరికట్టి, దీని వెనకున్న పెద్దలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చేశారు.

అయితే ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభించిన కాసేప‌టికే పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అసెంబ్లీ వైపు బయలుదేరగా, ట్యాంక్ బండ్ సమీపంలో పోలీసులు ఆపారు. ఆ సమయంలో పోలీసు అధికారులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పాదయాత్ర చేపడితే, అడ్డుకోవడం ఏంటని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు చర్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. డ్రగ్స్ వెనుక ఉన్న పెద్ద తలలను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

మీరు చేస్తున్న పాదయాత్ర‌కు అనుమతిలేద‌ని అందుకే అడ్డుకున్నామని పోలీసులు పోలీసులు తెలిపారు, రేవంత్ ను అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.