Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ కు ఆ దమ్ముందా ?

  • టిఎస్పిఎస్సీ జీతాల పెంపుపై రేవంత్ ఫైర్
  • హోంగార్డులకు, అటవీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచాలి
  • ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చినందుకు నజరానా ఇచ్చావా?
Revanth new challenge to cm kcr

తెలంగాణ సిఎం కెసిఆర్ పై టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కెసిఆర్ కు సరికొత్త సవాల్ విసిరారు రేవంత్. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులకు పెంచినట్లుగానే మూడు రెట్ల జీతాలను హోంగార్డులకు, అటవీ శాఖ ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆ దమ్ముందా కెసిఆర్ కు అని ప్రశ్నించారు  రేవంత్. సర్వీసు కమిషన్ సభ్యుల జీతాల పెంపుదలను నిరసిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకే వారికి జీతాలు భారగా పెంచారా అని ప్రశ్నించారు. టిఎస్ పిఎస్సీ తన చరిత్రలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ ను వివాదం చేసి నిరుద్యోగులను మోసగించిందని మండిపడ్డారు. సిఎం కోరుకున్న రీతిలోనే పబ్లిక్ సర్వీసు కమిషన్ పనిచేస్తున్నది కాబట్టి వారికి నజరానా కింద జీతాలు పెంచారా అని నిలదీశారు. సిఎంకు నచ్చితే నజరానా, నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా పరిస్థితి తయారైందన్నారు.

మరోవైపు తెలంగాణ సర్కారు మూడు రెట్లు పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుల జీతాలు పెంచడంపై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. ఏం గొప్ప పనిచేశారని వారికి మూడు రెట్ల జీతాలు 19 నెలల బకాయీలతో సహా చెల్లిస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చారని జీతాలు పెంచారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకే వారికి జీతాలు పెంచారా అని నిరుద్యోగులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చనట్లే ఇచ్చి గుంజుకోవాలన్న తెలంగాణ సర్కారు ఆలోచనా ధోరణికి అనుగుణంగా పనిచేస్తున్నారు కాబట్టే వారికి జీతాలు పెంచారని మండిపడుతున్నారు నిరుద్యోగులు.

Follow Us:
Download App:
  • android
  • ios