కేసిఆర్.. సంతోష్ రావుపై రేవంత్ ఫైర్ (వీడియో)

First Published 28, Feb 2018, 6:41 PM IST
revanth fire on kcr and santosh rao
Highlights
  • సంతోష్ రావు కు రాజ్యసభ ఎట్లిస్తవు?
  • ప్రాణాలిచ్చిన కుటుంబాలకు రాజ్యసభ సీటు ఇయ్యి
  • దుష్ట చతుష్టయం లాగ తెలంగాణను పీడిస్తున్నారు

టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, కేసిఆర్ సమీప బంధువు జోగినిపల్లి సంతోష్ రావు పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమంలో సంతోష్ ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నాడా అని ప్రశ్నించారు రేవంత్. సంతోష్ మీద పితకంత కేసు అయినా అయిందా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం ఘనకార్యం చేసిండని ఆయనకు రాజ్యసభ సీటు కట్టబెడుతున్నరని రేవంత్ ప్రశ్నించారు. రాజ్యసభలో టిఆర్ఎస్ తరుపున ఉన్నది ఇద్దరు బిసిలు, ఒక అయ్యగారు మాత్రమే ఉన్నరు. కాని, దళితుడు లేడు, గిరిజనుడు లేడు, మైనార్టీ లేడు అని విమర్శించారు. కేసిఆర్, సంతోష్ గురించి ఇంకేమన్నారో కింది వీడియోలో చూడండి.

 

loader