ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎలుగుబంటి సూర్యనారాయణ కేసు వివాదంపై తాజాగా రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఈ వివాదంలోకి మంత్రి హరీష్ రావును గుంజుకొచ్చారు. నాడు ఎలుగుబంటి సూర్యనారాయణ ఇచ్చిన వాంగ్మూలంలో హరీష్ ద్వారా కేసిఆర్ కు ముడుపులు ముట్టచెప్పారని రేవంత్ ఆరోపించారు. అలాగే సహారా ఇండియా కుంభకోణంలో కేసిఆర్ అక్రమ లబ్ధి చేకూర్చిన విషయంలో సిబిఐ విచారణ జరుగుతోందని విమర్శించారు. అందుకే కేసిఆర్ తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకుండా మోడీ సర్కారుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇంకా రేవంత్ ఏం మాట్లాడారో కింద వీడియోలో వినండి.