తిట్ల పోటీకి వస్తావా ? మంత్రిపై రేవంత్ ఫైర్ (వీడియో)

First Published 23, Dec 2017, 3:58 PM IST
Revanth dares minister LaxmaReddy for a cuss word duel
Highlights
  • తిట్ల పోటీకి వస్తావా? లక్ష్మారెడ్డి ? నేను రెడీ
  • నువ్వు నీళ్లు లేని బావి చూసుకోవాల్సి వస్తది
  • నా కుటుంబం.. నీ కుటుంబం ఏంటో తేల్చుకుందాం రా
  • నీ బండారం మొత్తం బయట పెడతా జాగ్రత

మంత్రి లక్ష్మ్యారెడ్డి పై రేవంత్ రెడ్డి తీవ్రమైన మాటలతో దాడి చేశారు. రాజకీయ నేతలు మీడియా ముందు వాడకూడని భాషలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్ లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పకుండా ..అరే ఒరే అంటావా? ........ అని విమర్శించారు.

మంత్రి లక్ష్మారెడ్డి చీకటి వ్యవహారం వివరాలతో సహా బయట పెడతా అన్నారు. నా ఉరికి రా ,,మేమేందో మా ఆస్తులేంటో తెలుస్తుంది ఒరే ..అరే అంటావా నీవో సన్నాసి వి.. నీ బతుకు నాకు తెలుసు అని తిట్టారు. లక్ష్మారెడ్డీ.. తిట్ల పోటీ పెట్టుకుంటావా? నీఇష్టం ..నేను రెడీ అని సవాల్ చేశారు. నేను రియల్ ఎస్టేట్ ఎకరాల్లో చేస్తున్నప్పుడు నువ్వు రియల్ బ్రోకర్ వి మరచిపోయావా? అని నిలదీశారు. కేసీఆర్ బూట్లు నాకిన చరిత్ర నీది.

మర్యాద గా మాట్లాడడం నేర్చుకో. డాక్టర్ సర్టిఫికెట్ నిజమా కాదా అని అడిగితే? అసలు వాస్తవాలు చెప్పకుండా తిడతావా? వంద పడకల ఆసుపత్రి తేకుండా కేసీఆర్ కు గులాం గిరి చేస్తున్నావు అని మండిపడ్డారు. లక్ష్మారెడ్డి నీ బినామీల బతుకు చరిత్ర ను త్వరలో బయట పెడతా అని హెచ్చరించారు.

 

మంద కృష్ణను వేధించడం దారుణం

ఎస్సి వర్గీకరణ కోసం పనిచేస్తున్న మంద కృష్ణ ను ప్రభుత్వం వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. వర్గీకరణ పై అఖిలపక్షం తీసుకు పోతామన్న కెసిఆర్ ఎందుకు తీసు పోలేదని ప్రశ్నించారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. మాదిగలపై అక్రమ కేసులు పెడుతున్నారని, మాదిగ సోదరులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. జైలులో ఉన్న మంద కృష్ణ మాదిగను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇంకా రేవంత్ ఏం మాట్లాడారో ఈ కింది వీడియోలో చూడండి.

 

 

(ఈ వీడియో పెద్దవాళ్లు మాత్రమే చూడగలరు.)

loader