కోస్గి సభలో కేసిఆర్ కుటుంబంపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు దమ్ముంటే కేసిఆర్ కొడంగల్ లో సభ పెట్టాలి తెలంగాణకు పట్టిన దయ్యం వదిలించేందుకే కాంగ్రెస్ లో చేరిన
కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఇవాళ తన కాంగ్రెస్ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గంలోని కోస్గిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టిడిపి నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిపారు. ఈ సభకు మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డికె.అరుణ హాజరయ్యారు. ఈ సభలో రేవంత్ రెడ్డి మరోసారి కేసిఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. రేవంత్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ...

రాష్ట్రానికి పట్టిన దయ్యాన్ని వదిలించాలి. అందుకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన.
ఒక్క జడ్పీటీసీ ని చేర్చుకోవడానికి ఐదుగురు మంత్రులు 5 గంటలు వేచి చూశారు.
మన సభ బయట పల్లి బటానీలు అమ్ముకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారో టిఆర్ఎస్ లో మన నియోజకవర్గం నుంచి చేరినవాళ్లు కూడా అంతమందే ఉన్నారు.
నాయకులను కొనడానికి అల్లుడు హరీష్ చిట్టా తయారు చేస్తే మామ కేసిఆర్ కొంటున్నాడు.
పోయినోడే మళ్ళీ మళ్ళీ పోయి పైరవీ భవన్ లో కూలి తెచ్చుకుంటున్నారు.
Ktr నీకు దమ్ము ఉంటే కొడంగల్ చౌరస్తాలో మీటింగ్ పెట్టు.
ని సత్తా ఏంటో నా సత్తా ఏంటో తెలుస్తుంది.
2009 లోనే నేను సవాల్ చేసి చెప్పిన.. గురునాథ్ రెడ్డి గడి మీద జెండా ఎగరేస్తా అన్న ఎగర వేసినం.
ఈరోజు గురునాథ్ రెడ్డి వల్ల కాదని తాండూరు లో చెల్లని రూపాయిని కొడంగల్ కు పట్టుకొస్తా అంటున్నాడు.
కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు 300 కోట్ల తో కొడంగల్ లో రోడ్లు వేయించా.
350 కోట్ల తో కాంగ్రెస్ ప్రభుత్వం లో నేను వాటర్ గ్రిడ్ తీసుకొచ్చా.
రైల్వె లైన్ కొడంగల్ ప్రజల చిరకాల కోరిక.
నేను 750 కోట్ల తో ప్రాజెక్టు మంజూరు చేయించాను.
రైల్వె లైన్ ఫైల్ ను గత మూడున్నరేళ్లుగా ముఖ్యమంత్రి తన ముడ్డి కింద పెట్టుకున్నాడు.
నా మీద కోపం తో కొడంగల్ లో అభివృద్ధిని అడ్డుకుంటుండు.
నా సొంత డబ్బులతో బస్ డిపో కోసం భూమి నిధులు ఇచ్చిన.
40 నెలలు అవుతున్నా మహేందర్ రెడ్డి కనీసం టెండర్లు పిలిచే దిక్కు లేదు.
హైద్రాబాద్ బీజాపూర్ రహదారిని జాతీయరహదారిని చేయించింది నేనే.
కొడంగల్ ప్రజల గౌరవం పెంచేలా పనిచేస్తున్నా.
తెలంగాణ కు పట్టిన చీదను వదిలించడానికే కాంగ్రెస్ లో చేరాను.
నా అధిష్టానం కొడంగల్ వీధుల్లో ఉంది.
కొడంగల్ గడి మీద ఎలా జెండా ఎగరవేసినమో కేసీఆర్ గడి మీద కూడా జెండా ఎగరవేద్దాం.
అధికారం, పదవుల కోసం పార్టీ మారలేదు. ప్రజలకోసమే ప్రతిపక్ష పార్టీ లో చేరాను.
అవినీతి సొమ్ముతో కొడంగల్ కు వచ్చి సంతలో పశువులను కొన్నట్ల కొనాలని చూస్తున్నారు.
కొడంగల్ ప్రజలు పేదవాళ్ళు కావొచ్చు కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోరు.
Trs లో ఇచ్చేవి తీసుకోండి, వాళ్ళు కష్ట పడ్డ సొమ్ము కాదు అది మనని దోచుకున్నదే.
14 సంవత్సరాలు పోరాటం చేసిన trs కార్యకర్తలనే కేసీఆర్ పట్టించుకోవడం లేదు.
గడిల ముందు చెప్పులు వదిలి చేతులు కట్టుకోవడానికి కొడంగల్ ప్రజలు సిద్ధంగా లేరు.
నా మీద పోటీ కి కేసీఆర్ వస్తాడా ktr వస్తాడా రండి ఎవడు మొగోడో చూసుకుందాం.
కొడంగల్ లో నా కార్యకర్తలు కాళ్ళ కింద నలిగిపోతారు.
ని దగ్గర ఉన్నవాళ్లు కూలిగాళ్ళు, నా దగ్గర ఉన్నవాళ్లు ఆత్మభిమానం ఉన్న వాళ్ళు.
నేను రాజకీయాలు చేస్తే కొడంగల్ నుంచే. కొడంగల్ వదిలేయాల్సి వస్తే రాజకీయలు వదిలేస్తా.
నా కుటుంబం కంటే నా జెండా మోసిన వాడే నాకు ఎక్కువ.
ప్రాణాలు వదిలేసినప్పుడు నా సమాధి కూడా కొడంగల్ లోనే ఉంటుంది.
కొడంగల్ ప్రజల అండ ఉంటే కేసీఆర్ ను దింపి తీరుతా.
ఇక్కడికి వచ్చిన వాళ్లందరికీ కండువాలు కప్పాలి అంటే 4 లారీల కండువాలు కావాలి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీధర్ బాబుకు ముందస్తు బెయిల్
హైదరాబాద్ లో అడుక్కుతింటే కుదరదు
కొలువుల కొట్లాటకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
