తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరో సెటైర్ పేల్చారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. చాన్స్ దొరికితే చాలు సిఎం మీద, సిఎం కేసిఆర్ కుటుంబసభ్యల మీద పంచ్ లు, సెటైర్లతో రెచ్చిపోవడం రేవంత్ కు ఇవాళ కొత్తేం కాదు. తాజాగా కేసిఆర్ పనితీరుపై ట్విట్టర్ ద్వారా ఒక పంచ్ డైలాగ్ పేల్చారు.

ఆ ట్విట్ లో ఏమన్నారంటే.. కేసిఆర్ కు కుంభకర్ణ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఏడాది కాలంగా సిఎం కేసిఆర్ ‘వర్క్ ఫ్రం హోం’ ఎంచుకున్నారని విమర్శ చేశారు. ప్రగతి భవన్ నుంచే పరిపాలన చేస్తున్న కేసిఆర్ సచివాలయానికి రాక ఏడాది గడిచిపోయిన సందర్భంగా రేవంత్ ఈ ట్విట్ వ్యంగ్యంగా పోస్టు చేశారు.

కొత్త సచివాలయం నిర్మాణం కోసం వాయు వేగంతో ప్రయత్నాలు చేస్తున్న సిఎం కేసిఆర్ బహుషా తన పదవీ కాలంలో ఇప్పుడున్న పాత సచివాలయంలో కాలు పెట్టే అవకాశాలు లేకపోవచ్చని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రగతి భవన్ నిర్మాణం పూర్తి కాకముందు సిఎం అడపాదడపా సచివాలయానికి వచ్చారు. ఎప్పుడైతే ప్రగతి భవన్ నిర్మాణం కంప్లిట్ అయిందో అప్పటి నుంచి సి బ్లాక్ సిఎం రాకపోవడంతో చిన్నబోయింది.

అయితే ఇటీవల సి బ్లాక్ లో పర్యటించి సిఎం కుమార్తె, ఎంపి కవిత సి బ్లాక్ కు కొత్త శోభను తెచ్చారు. సి బ్లాక్ లో ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. 5వ ఫ్లోర్ లో ఉన్న మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ఛాంబర్లో కూర్చున్నారు. రేవంత్ ట్విట్ కింద లింక్ లో చూడొచ్చు.