శ్రీశైలం: శ్రీశైలం పవర్ హౌస్ అగ్ని ప్రమాదంలో చిక్కుకొన్న తొమ్మిదిమందిలో ఆరు మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. ఇంకా ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గురువారం నాడు అర్ధరాత్రి శ్రీశైలం పవర్ హౌస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 10 మంది సురక్షితంగా తప్పించుకొన్నారు. మరో 9 మంది ఈ ప్రమాదంలో చిక్కుకొన్నారు. 

ప్రమాదంలో చిక్కుకొన్నవారి కోసం రాత్రి నుండి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇవాళ ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. సీఐఎస్ఎఫ్  సిబ్బంది పవర్ హౌస్ లో గాలింపును చేపట్టారు.

పవర్ హౌస్ లో పనిచేసే ఉద్యోగుల జర్కీన్లు, చెప్పులను రెస్క్యూ టీమ్ గుర్తించింది. మధ్యాహ్నానికి ఏఈ సుందర్ నాయక్  మృతదేహాన్ని గుర్తించారు.

also read:అంబులెన్స్ లో పవర్ హౌస్‌లోకి వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డి: ఆ మూడు ద్వారాల్లో పొగ

పవర్ హౌస్ లోని ఎంసీఆర్ విభాగంలో సుందర్ నాయక్ పనిచేస్తున్నాడు. ఎంసీఆర్ విభాగంలో మంటలు వ్యాప్తి చెందడంతో అక్కడి నుండి తప్పించుకొనేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో సుందర్ నాయక్ మెట్లపైనే మరణించాడు. సుందర్ నాయక్ డెడ్ బాడీ 90 శాతం కాలిపోయిందని జెన్ కో సిబ్బంది చెబుతున్నారు. 

సుందర్ నాయక్ స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం జగన్ తండా. సుందర్ నాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అంబులెన్స్ లో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.

సుందర్ నాయక్ మృతదేహన్ని వెలికి తీసిన తర్వాత మరో ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఈ డెడ్ బాడీలను పోస్టు మార్టం కోసం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. 

 

ఈ ప్రమాదంలో చిక్కుకొన్నవారి వివరాలు


ఈ ప్రమాదంలో డీఈ  శ్రీనివాస్ గౌడ్ ( హైదరాబాద్)
ఏఈలు AE వెంకట్‌రావు (పాల్వంచ)
 మోహన్ కుమార్,(హైదరాబాద్),

ఉజ్మ ఫాతిమా(హైదరాబాద్),
 సుందర్  నాయక్ (సూర్యాపేట)
ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా)
 జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ ( పాల్వంచ)


 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ లను గుర్తించారు.వీరిలో సుందర్ నాయక్, మోహన్, ఉజ్మా ఫాతిమా డెడ్ బాడీ మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.