రూ.1800 కోట్ల గ్రాంట్లు విడుదల చేయండి.. నీతి అయోగ్ కు తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth reddy) నీతి అయోగ్  వైస్ చైర్మన్ సుమ‌న్ భేరీ ( NITI Aayog Vice Chairman Suman Bery)ని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Release grants of Rs 1,800 crore. Telangana govt's appeal to NITI Aayog..ISR

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని తెలంగాణ‌ ప్రభుత్వం నీతి అయోగ్ ను కోరింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమ‌న్ భేరీని కలిసి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇప్పించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు.

హైస్పీడ్ ఏరియల్ టార్గెట్ ‘అభ్యాస్’ ప్రయోగం సక్సెస్.. దీంతో ఉపయోగాలు ఏంటంటే ?

దీనికి అవ‌స‌ర‌మైన ప్రపంచ‌బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం వైద్య‌, ఆరోగ్య‌, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్క‌ర‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ..

డిసెంబర్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జనవరిలో ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణకు పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలని కోరారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రూ.1800 కోట్లు విడుదల చేయాలని, 15వ ఆర్థిక సంఘం బకాయిల నుంచి రాష్ట్రానికి రూ.2,233.54 కోట్లు కేటాయించాలని కోరారు. కాగా.. అదే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తెలంగాణకు మరింత మంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios