తెలంగాణలో జిల్లాల కుదింపు..? ఎన్ని జిల్లాలు తగ్గనున్నాయంటే ?
తెలంగాణలో జిల్లాలను కుదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం కొన్ని జిల్లాలో తక్కువ జనాభా ఉందని, అందుకే తగ్గించాలని యోచిస్తోందని తెలుస్తోంది.
తెలంగాణలో పాలన, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు జిల్లాల పునర్విభజన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, వాటిలో ఏడు జిల్లాలు ఆరు లక్షల లోపు జనాభాను కలిగి ఉన్నాయి. దీంతో సమర్థవంతమైన పాలనపై అందించలేకపోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
మద్యం తాగుదామని తీసుకెళ్లి యువకుడి దారుణ హత్య.. హైదరాబాద్ లో ఘటన..
దీంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా ఏర్పాటులో లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమగ్ర పునాది లేకుండా ఏర్పాటు చేసిన ప్రస్తుత జిల్లా సరిహద్దులను మరింత సమన్వయం, వనరుల కేటాయింపు కోసం పునఃసమీక్షించాలని భావిస్తున్నట్టు ‘సియాసత్’ కథనం పేర్కొంది.
ఇంటికి కేజీ బంగారమిచ్చినా ఓటమి తప్పదు జగన్ - నారా లోకేష్
2016 నుంచి 2019 వరకు గత ప్రభుత్వం పరిపాలనా అవసరాల కోసం పది జిల్లాలకు 23 కొత్త జిల్లాలను చేర్చింది. అయితే ఈ విస్తరణ అశాస్త్రీయమని రేవంత్ రెడ్డి విమర్శించారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన యోచిస్తున్నారు. పాలనను క్రమబద్ధీకరించేందుకు జిల్లాల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుంచి 25 లేదా 26కు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో ప్రధాన పార్టీలకు ఉన్న బలాలేంటి.. ? బలహీనతలేంటి ?
అయితే ప్రభుత్వ ఈ నిర్ణయం రాజకీయ చర్చలకు దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ పలు జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ములుగు, జయశంకర్-భూపాలపల్లి, సిరిసిల్ల వంటి జిల్లాల్లో ఆరు లక్షల లోపు జనాభా ఉంది. వనరులను సద్వినియోగం చేసుకోవడానికి, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని జిల్లాలను విలీనం చేసే అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల పునర్విభజన పకడ్బందీగా జరిగేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది.