Asianet News Telugu

హోంమంత్రి నాయిని కి వరంగల్ లో షాక్ (వీడియో)

  • రిజర్వేషన్ల మీద నాయిని కామెంట్స్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన రెడ్డి యూత్
  • వాటర్ బాటిళ్లు విసిరి నిరసన 
reddy youth fire on home minister naini
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి వరంగల్ నగరంలో షాక్ తగిలింది. రెడ్డి కులానికి చెందిన యూత్ నాయినిపై విరుచుకుపడ్డారు. వాటర్ బాటిళ్లు వేదిక మీదికి విసిరి ఆందోళన చేశారు. నాయినికి చిరాకు తెప్పించారు. సంచలనం రేపిన ఈ ఘటన తాలూకూ వివరాలిలా ఉన్నాయి.

ఆదివారం మధ్యాహ్నం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్ లో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాకతీయ రెడ్ల శంఖారావం జరిగింది. వివిధ జిల్లాల నుంచి ఐక్య వేదిక కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన నాయిని మాట్లాడుతున్న సందర్భంలో వివాదం చెలరేగింది. రెడ్డి ఐక్య వేదిక డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించడం నా చేతిలో కాదు ఎవరి చేతిలో లేదని హోంమంత్రి నాయిని ప్రకటించారు. రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగంలోనే పొందుపరిచారని, వాటిని మార్చడం ఎవరి తరం కాదని నాయిని పేర్కొన్నారు. దీంతో సభలో ఉన్న యూత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయినికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే మీరు గోల చేసినంత మాత్రాన జరిగేదేమీ లేదని నాయిని మాట్లాడారు. కొందరు యువకులు సభ వేదిక మీదకు వాటర్ బాటిళ్లు విసిరి ఆందోళన చేశారు. అయితే సభ నిర్వాహకులు సంయమనం పాటించాలని పదే పదే విన్నవించడంతో యూత్ శాంతించారు. ముఖ్య అతిథిగా పిలిచి సభలో హోంమంత్రి నాయిని ని అవమానించడం సరికాదని సర్ది చెప్పారు.  అనంతరం తన ప్రసంగాన్ని నాయిని కంటిన్యూ చేశారు. రిజర్వేషన్ల అంశం కాకుండా రెడ్డి కులంలోని నిరుపేద కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని నాయిని హామీ ఇచ్చారు. సభలో వాటర్ బాటిల్స్ విసిరిన సందర్భంలో జరిగిన గొడవ వీడియో కింద ఉంది చూడండి.

వేదిక మీద వాగ్వాదం
ఈ సభకు పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి సమస్యలను చేర్చుతామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. ఈ విషయమై వారిని.. విమర్శిస్తూ నాయిని మాట్లాడుతుండగా.. డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి మంత్రితో వాగ్వాదానికి దిగారు. వెంటనే నిర్వహకులు వారిని సముదాయించారు. దీని తర్వాత అసెంబ్లీలో కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టి కేంద్రానికి పంపినా.. అక్కడ వారు ఒప్పుకోవడం లేదని మంత్రి అనగానే భాజపా నేత ఎడ్ల అశోక్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఆయనతో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వాగ్వాదానికి దిగారు.

Follow Us:
Download App:
  • android
  • ios