మున్సిపల్ పోల్స్: టీఆర్ఎస్ తలనొప్పి, రెబెల్స్ బెడద

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు రెబెల్స్ బెడద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. 

Rebels may upset TRS in municipal polls

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు ముందుకు వస్తుండటంతో వారికి నచ్చచెప్పడం ఎమ్మెల్యేలకు తలకుమించిన భారంగా మారుతుంది.

Also read: కేసీఆర్ వచ్చినా రాని మంత్రులు: క్లాస్ తీసుకొన్న గులాబీ బాస్

 గెలుపు గుర్రాలకే టికెట్లు అని ప్రకటనలు చేస్తున్నా.... ఎన్నో రోజులుగా పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలు టికెట్లు తమకు దక్కుతాయని అంచనా వేసుకుంటున్నారు.కానీ సర్వేలు ,ఎమ్మెల్యేల అభిప్రాయాలను అనుగుణంగానే టికెట్ ఖరారు కానున్నాయి.

also read:మున్సిపల్ పోల్స్: ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

ఎమ్మెల్యేలకు పార్టీ బి ఫారాలు అందజేయడంతో నేతల్లో మరింత టెన్షన్ మొదలైంది.నామినేషన్లు వేసేందుకు రేపు ఒక్క రోజే చివరి రోజు. దీంతో అధికార పార్టీ టిక్కెట్ పై పోటీలో ఉండాలని భావిస్తున్న నేతలంతా భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో  పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే ఏం చేయాలన్నా ప్రత్యామ్నాయ అవకాశాలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కొంత మంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేస్తున్నట్లు సమాచారం. మరికొంతమంది మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

టిఆర్ఎస్ పార్టీ కూడా రెబల్స్ ను సాధ్యమైనంత వరకు పోటీ నుంచి తప్పించాలన్న భావనలో ఉంది. పోటీకి అవకాశం దక్కకపోయినా అధికారపార్టీ కావడంతో భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇస్తామని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.

పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులకు విజయం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యేలు సీఎం మాటగా నేరుగా అభ్యర్థుల కు చెబుతున్నట్లు తెలుస్తోంది..పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న మెజారిటీ నేతలు మాత్రం ఇప్పుడు అవకాశం కోల్పోతే మరో ఐదేళ్లు అవకాశం రాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎన్నికల బరిలో ఉండాలన్నా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

 రెబల్స్ రంగంలోకి దిగకుండా అధికారపార్టీ ముందు జాగ్రత్తలు చేపడుతున్నా.... గులాబీ పార్టీ అభ్యర్థులకు రెబల్స్ నుంచి ప్రమాదం పొంచి ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ రెబెల్స్ ను విపక్షాలు తమ వైపుకు తిప్పుకొనే అవకాశం లేకపోలేదనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఈ విషయంలో విపక్షాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో ఫలితాలు తేల్చనున్నాయి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios