Asianet News TeluguAsianet News Telugu

రియాల్టర్ విజయభాస్కర్ రెడ్డి హత్య : నాటు తుపాకీ ఎక్కడా? వెలుగులోకి కొత్త కోణాలు...

సోమవారం ఉదయం  తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం  నగదుతో  ఇంటి నుంచి కారులో  బయలు బయలుదేరిన  విజయ భాస్కర్ రెడ్డి  కొద్ది దూరంలో నివసించే నరేందర్ ని తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్ రెడ్డి పథకం ప్రకారం విజయ భాస్కర్ రెడ్డి ని పెద్ద కబేలా పక్కన ఉన్న  ఖాళీ స్థలంలో కి తీసుకు వెళ్ళాడు.  అక్కడ తనకు రావాల్సిన కమిషన్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి  దిగాడు.  అదను చూసి  వెనక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకితో విజయభాస్కర్రెడ్డి తలలోకి కాల్చాడు.

realtor vijay bhaskar reddy murder case update
Author
Hyderabad, First Published Dec 1, 2021, 11:28 AM IST

రసూల్ పుర :  హైదరాబాదులోని తిరుమలగిరి thana పరిధిలోని పెద్ద కబేలా ఖాళీస్థలంలో శవమై కనిపించిన Realtor తోట విజయ భాస్కర్ రెడ్డి murder కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.  ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే  వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్ రెడ్డి  నాటు gunతో కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఆర్థిక  లావాదేవీలు
టెంపుల్ ఆల్వాల్ లోని శ్రీనివాస నగర్ కు చెందిన తోట Vijayabhaskar Reddy, నరేందర్ రెడ్డి Real estate business చేస్తున్నారు.  కొన్ని లావాదేవీలను ఇద్దరూ కలిసి, మరికొన్నింటిని ఎవరికివారుగా చేసుకునేవారు.  అయితే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. దీంతో కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్థలు నడుస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవల Financial hardshipల్లో పడిన నరేందర్ వాటి నుంచి బయటపడడానికి, తనకు రావాల్సిన కమిషన్ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్ రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.  కొన్ని రోజుల క్రితం ఓ నాటు తుపాకి ఖరీదు చేసిన నరేందర్ దాన్ని తన ఇంటి వెనుక ఉన్న చెరువు సమీపంలో పాతి పెట్టాడు. ఆదివారం దీన్ని బయటకు తీసి తన వద్ద ఉంచుకున్నాడు.

హైద్రాబాద్‌లో కారులో మృతదేహం: రియల్‌ వ్యాపారి విజయ భాస్కర్ రెడ్డిగా గుర్తింపు

పథకం ప్రకారం..
సోమవారం ఉదయం  తాను కొనుగోలు చేస్తున్న Flat registration కోసం  నగదుతో  ఇంటి నుంచి కారులో  బయలు బయలుదేరిన  విజయ భాస్కర్  రిజిస్ట్రేషన్  పూర్తయిన తర్వాత  శ్రీశైలం వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వస్తాను అని అంటూ  ఇంట్లో చెప్పాడు.  కొద్ది దూరంలో నివసించే నరేందర్ ని తన కారులో ఎక్కించుకున్నాడు.

నరేందర్ రెడ్డి పథకం ప్రకారం విజయ భాస్కర్ రెడ్డి ని పెద్ద కబేలా పక్కన ఉన్న  ఖాళీ స్థలంలో కి తీసుకు వెళ్ళాడు.  అక్కడ తనకు రావాల్సిన కమిషన్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి  దిగాడు.  అదను చూసి  వెనక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకితో విజయభాస్కర్రెడ్డి తలలోకి కాల్చాడు.

పుర్రెను చీల్చుకుంటూ దూసుకుపోయిన  తూటా  లోపలే ఉండిపోయింది.  దీంతో ఆయన ముక్కు చెవులు నోటి నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యింది.  భాస్కర్ రెడ్డి చనిపోయాడు అని నిర్ధారించుకున్న నరేందర్ రెడ్డి అక్కడి నుంచి  నగదు తీసుకుని పారిపోయాడు.  కారులో రక్తం మడుగులో ఉన్న విజయ భాస్కర్ ను  సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు.. తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆయన అప్పటికే మరణించినట్లు గుర్తించారు. 

తుపాకీ ఎక్కడ?
రంగంలోకి దిగిన పోలీసులు  నరేందర్ ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.  అతడు నాటు తుపాకీ ని రహస్యంగా దాచినట్లు తేలడంతో దాని కోసం గాలిస్తున్నారు. మరోపక్క ఇతడికి ఎవరైనా సహకరించారా?  అనే అంశాన్ని కూడా ఆరా తీస్తున్నారు.  బుధవారం  నిందితుడి అరెస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.  విజయ భాస్కర్ రెడ్డి మృతితో  శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో  విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఇటీవల  ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడని సన్నిహితులు పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios