ration cards : కొత్త రేషన్ కార్డులు మరింత ఆలస్యం.. కారణమేంటంటే ?
telangana new ration cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని అందరూ భావించారు. కానీ అది కొంత ఆలసమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆరు గ్యారెంటీల కోసం ఇప్పటికే రేషన్ కార్డు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంత కాలం తరువాత కొత్త కార్డులు జారీ చేయాలని అనుకుంటోందని సమాచారం.
new ration cards : తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. డిసెంబర్ 28వ తేదీ నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. ఈ పథకాలన్నింటికి దాదాపుగా వైట్ రేషన్ కార్డునే అర్హతగా పరిగణించాలని భావిస్తోంది. ఈ ప్రజాపాలన జనవరి 6వ తేదీ వరకు కొనసాగనుంది.
ayodhya ram mandir : అయోధ్యకు తమిళనాడులో తయారైన 48 గుడిగంటలు.. ఒక్కోదాని బరువెంతో తెలుసా?
వాస్తవానికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తరువాత వాటి ఆధారంగా 6 గ్యారెంటీల కోసం దరఖాస్తు స్వీకరించాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తి కావాలంటే కాస్త సమయం పడుతుంది. కానీ ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి కొత్త రేషన్ కార్డులు వచ్చేంత వరకు వేచి చూస్తే గ్యారెంటీలను అమలు చేయడం ఆలస్యం అవుతుంది.
భూపాలపల్లిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా.. ఒకరి పరిస్థితి విషమం..
అందుకే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుదారుల నుంచి ఈ ఆరు గ్యారెంటీ కోసం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని రోజుల అనంతరం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని యోచిస్తున్నట్టు సమాచారం. కాగా.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో రేషన్ కార్డుల జారీ అంశం లేదు. కానీ రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తామనే హామీ మాత్రం ఆరు గ్యారెంటీలోని మహాలక్ష్మీ పథకంలో ఉంది. అయితే దీనికి కూడా రేషన్ కార్డునే అర్హతగా పరిగణించాలని చూస్తోంది. దీంతో రేషన్ కార్డులు లేని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉంది.
హిందీ మాట్లాడే వారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతారు - డీఎంకే నేత దయానిధి వివాదాస్పద వ్యాఖ్యలు
కాగా.. మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించే సమయంలో కుటుంబ వివరాలు కూడా తీసుకుంటారని సమాచారం. ఓ కుటుంబానికి ఎంత భూమి ఉంది ? ఎన్ని ఇళ్లు ఉన్నాయి ? వచ్చే ఆదాయం ఎంత ? ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ? ఉద్యోగాలు, వ్యాపారాలు, వాహనాలతో పాటు మరికొన్ని వివరాలు సేకరిస్తారని తెలుస్తోంది.