Asianet News TeluguAsianet News Telugu

ayodhya ram mandir : అయోధ్యకు తమిళనాడులో తయారైన 48 గుడిగంటలు.. ఒక్కోదాని బరువెంతో తెలుసా?

బెంగళూరుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే భక్తుడు గత నెలలో అయోధ్యలోని రామాలయానికి 48 గంటలను తయారు చేయాలని ఆర్డర్ ఇచ్చాడు. ఇందులో 42 గంటలు పంపిణీ చేశారు. మిగిలిన ఆరు బెల్స్‌ను కార్మికులు తయారు చేస్తున్నారని, జనవరి 22, 2024లోపు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

Ayodhya Ram Mandir : Ayodhya has 48 bells made in Tamil Nadu, Do you know the weight of each one? - bsb
Author
First Published Dec 25, 2023, 8:46 AM IST

తమిళనాడు : అయోధ్యలో  రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. రామాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడులోని నమ్మక్కల్ లో తయారైన 42 గుడిగంటలు  అయోధ్యకు బయలుదేరాయి.  రామాలయంలో కొలువుదీరనున్న ఈ గుడిగంటలను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీటిని పెద్ద పెద్ద లారీల్లో  తరలిస్తున్నారు. ఈ గంటలు ఒక్కొక్కటి రెండు టన్నుల బరువు ఉన్నట్లుగా సమాచారం. ఒక గంట రెండున్నర టన్నుల బరువు ఉంది. 

అయోధ్యకు గంటలు బయలుదేరుతుండడంతో జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో ఈ గంటలను ఏర్పాటు చేయనున్నారు. గర్భాలయంపై ఏర్పాటు చేయనున్న గంటను కూడా ఇక్కడే తయారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ దేవాలయాన్ని నాగర శైలిలో, అష్టభుజి ఆకారంలో నిర్మించారు.

నేపాల్ లో అద్భుతం.. 11వేల అడుగుల విస్తీర్ణంలో సీతారాముల కల్యాణ వేడుక చిత్రం..

తమిళనాడులోని నమక్కల్ జిల్లాకు చెందిన కళాకారులు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం కోసం మొత్తం 42 గంటలను తయారు చేశారు. వీటిని ప్రత్యేక పూజల అనంతరం మొదట బెంగళూరుకు పంపించారు. బెంగళూరుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే భక్తుడు గత నెలలో ఆండాల్ మోల్డింగ్ వర్క్స్ అనే కంపెనీకి 48 బెల్స్ తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. ఇది నమక్కల్‌లోని మోహనూర్ రోడ్‌లో ఉంది. ఈ ఆర్డర్ ప్రకారం మొత్తంగా, కంపెనీ 1,200 కిలోల బరువున్న 42 బెల్స్‌ను తయారు చేసింది. అనంతరం నమక్కల్ ఆంజనేయర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గంటలను బెంగళూరుకు పంపించారు.

సుమారు 20 మంది కార్మికులు గత నెల రోజులుగా శ్రమించి ఈ బెల్స్‌ను తయారు చేశారని ఆండాల్ మోల్డింగ్ వర్క్స్ ప్రొప్రైటర్ ఆర్.రాజేంద్రన్ తెలిపారు .గత ఏడు తరాలుగా తమ కుటుంబం ఈ వ్యాపారంలో నిమగ్నమై ఉందని రాజేంద్రన్ తెలిపారు. ఈ సంస్థ గురించి తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ చెన్నైకి చెందిన వ్యాపారి ద్వారా వారిని సంప్రదించాడు. అయోధ్యలోని రామమందిరానికి గంటలను సరఫరా చేయమని రామమందిరం పరిపాలన నుండి రాజేంద్రప్రసాద్ కి ఆర్డర్ వచ్చింది.

“గంటల తయారీకి కావాల్సిన వెండి, రాగి, కంచుతో సహా మెటీరియల్ అంతా ఆయనే అందించాడు. గంట తయారీకి, ఒక్కోదానికి రూ. 600 ఇచ్చాడు. సాధారణంగా మేము గంటకు రూ.1,200 వసూలు చేస్తాం. కానీ ఈ గంటలు రాంమందిర్ కోసం కాబట్టి.. ఆయన అడిగిన మొత్తానికి అంగీకరించాం”అని రాజేంద్రన్ తెలిపారు.

మిగిలిన ఆరు బెల్స్‌ను కార్మికులు తయారు చేస్తున్నారని, జనవరి 22, 2024లోపు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి గంట కొలతలు మారుతూ ఉంటాయి. ఐదు గంటలు ఒక్కొక్కటి 120 కిలోలు, ఆరు గంటలు ఒక్కొక్కటి 70 కిలోలు, ఒక గంట 25 కిలోల బరువుంటాయని రాజేంద్రన్ చెప్పారు.

జనవరి 22న రామమందిరంలో జరిగే 'ప్రాణ్-ప్రతిష్ఠ' లేదా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని టెంపుల్ టౌన్‌లో జరిగే మెగా వేడుక కోసం దాదాపు 8,000 మందికి ఆహ్వానాలు పంపబడ్డాయి. వీరిలో ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరితో పాటు 4,000 మంది సాధువులకు కూడా ఆహ్వానాలు అందాయి. 'ప్రాణ్-ప్రతిష్ఠ' లేదా రామ్ లల్లా (బాలరాములు) పవిత్రోత్సవం కోసం ప్రక్రియ జనవరి 16, 2024న ప్రారంభమవుతుంది. వారణాసికి చెందిన వేద పండితుడు పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ నేతృత్వంలో వేద ఆచారాలు నిర్వహించబడతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios