వంకాయ ముక్క అని కొరకబోతే..?

rat came in vankaya curry at warangal
Highlights

వంకాయ ముక్క అని కొరకబోతే..?

ఒక వ్యక్తికి బాగా ఆకలిగా అనిపించి.. వెంటనే రోడ్డుపై కనిపించిన రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం ఆర్డర్ చేశాడు.. ప్టేటులో ఆలు వంకాయ కర్రీ నచ్చిందమో వెంటనే దానిని కలుపుకు తిన్నాడు. సరిగ్గా ఆ సమయంలో వంకాయ కాడ అనుకుని నోట్లో పెట్టుకుంటుంటే అనుమానం వచ్చి చూస్తే.. అది ఎలుక .. అంతే తింటున్నవాడు కాస్తా వెళ్లి వాంతి చేసుకున్నాడు. వరంగల్ నగరానికి చెందిన రమేశ్ హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.. బాగా ఆకలిగా వేయడంతో తాను భోజనం చేసి.. భార్యకు ఏమైనా తీసుకెళదామని హోటల్‌కు వచ్చాడు.. భోజనం ఆర్డర్ చేసి.. తను కూడా భోజనం చేస్తున్న సమయంలో ఆలూ వంకాయ కూరలో ఎలుక ప్రత్యక్షమైంది.. వంకాయ ముక్క అని భావించి నోట్లో పెట్టుకుంటుండగా.. ఎలుకను గుర్తించాడు.. అయితే అప్పటికే ఎలుక చచ్చిన కూర తినడంతో స్వల్ప అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నాడు.. వెంటనే విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు.. వారు దురుసుగా ప్రవర్తించచడంతో.. మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
 

loader