పెద్దపల్లి: ఒంటరిగా వెళుతున్న యువతిని వెంబడించి కత్తులతో బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. కామాంధుల నుండి యువతిని కాపాడిన స్థానికులు దేహశుద్ది చేశారు. 

వివరాల్లోకి వెళితే... గోదావరి ఖని ఇంక్లైన్ గడ్డ వద్ద ఓ యువతి ఒంటరిగా వుండటాన్ని కొందరు ఆకతాయిలు గుర్తించారు. దీంతో కత్తులతో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ ఘటనతో బెదిరిపోయిన యువతి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన యువకులను పట్టుకుని దేహశుద్ది చేశారు.  స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.