నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై పంజాగుట్ట పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. శివకుమార్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ మహిళా నేత పోలీసులకు ఫిర్యాాదు చేశారు.
నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డిపై అత్యాచార వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, అత్యాచారం చేశాడనని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. శివకుమార్ రెడ్డి తనకు మద్యం తాగించి, సిటీలోని ఓ హోటల్‌లో తనను రేప్ చేశారని తెలిపింది. ఈ చర్యలను వీడియో కూడా రికార్డ్ చేశారని ఆమె ఫిర్యాదు చేసింది.
భార్య ఫోన్ లో మాట్లాడుతుందని కొట్టి చంపిన భర్త.. చివరికి...
తాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) సభ్యురాలినని, 2020లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం తనను సమన్వయ కర్తగా నియమించారని ఆ మహిళ తెలిపింది. ‘‘నాకు నారాయణ పేట ప్రాంతం కేటాయించారు. దీంతో నేను అక్కడికి వెళ్లాను. ఆ జిల్లాకు చేరుకున్న వెంటనే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన కుంభం శివకుమార్ రెడ్డిని కలవాల్సి వచ్చింది. అతడు నాతో సన్నిహితంగా ఉండాలని అనుకున్నాడు. నాకు అతడి నుంచి మెసేజ్ లు వచ్చేవి. ఓ సమయంలో నన్ను పెళ్లి చేసుకుంటానని మెసేజ్ పంపించాడు. మీకు ఇప్పటికే పెళ్లి జరిగింది కదా అని అడిగాను. అయితే నా భార్య అనారోగ్యంతో ఉందని, ఆమె మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా బతకదని చెప్పారు. నన్ను చూసుకునేందుకు ఒక మహిళ అవసరం అని చెప్పాడు ’’ అని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
మునుగోడు ఉప ఎన్నికలు 2022: సీపీఐ బాటలోనే సీపీఎం
ఈ కేసు విషయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ దుబ్బాకలో ఉన్న సమయంలో శివకుమార్ రెడ్డి ఆమె ఉండే రూమ్ కు వచ్చాడు. ఆ సమయంలో అతడితో లైంగిక సంబంధం ఏర్పర్చుకోవాలని చెప్పాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో దాడి చేశాడు. తరువాత ఆమె మెడలో పసుపు తాడు కట్టాడు. కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉందని బాధితురాలిని ఓ హోటల్ గదికి పిలిపించాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమె కు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనిని అంతా అతడు తన సెల్ ఫోన్ కెమెరా ద్వారా రికార్డ్ చేశాడు. తనతో సరిగా ఉండకపోతే ఆ ఫొటోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు. బాధితురాలు ఈ విషయంలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 420, 476, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
