Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉప ఎన్నికలు 2022: సీపీఐ బాటలోనే సీపీఎం

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే  ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఎం నిర్ణయించింది. ఈ విషయమై సీపీఎం ఇవాళ అధికారికంగా ప్రకటించింది. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ విషయమై చర్చించారు. 

CPM  Supports TRS In Munugode Bypoll 2022
Author
First Published Sep 1, 2022, 11:31 AM IST

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే  ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ కు  మద్దతివ్వాలని  సీపీఎం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  గురువారం నాడు సీపీఎం స్పష్టత ఇచ్చింది.. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి మద్దతిస్తామని సీపీఐ గత నెల 20వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. సీపీఐ దారిలోనే సీపీఎం వెళ్లింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతివ్వాలని తమ పార్టీని కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కోరిన విషయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.  బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నామని వీరభద్రం స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీలో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని వీరభద్రం వివరించారు. 
మునుగోడు అసెంబ్లీ స్థానంలో లెఫ్ట్ పార్టీలకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూరు మండలాల్లో సీపీఎంకు ఓటు బ్యాంకు ఉంది. 

సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఇటీవల జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులతో పాటు మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సీపీఎం చర్చించింది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాలని సీపీఎం ఈ సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ప్రకటించారు.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక విషయమై సీపీఐ రాష్ట్ర నాయకత్వం కూడా సీపీఎంతో ఇటీవల చర్చలు జరిపారు. లెఫ్ట్ పార్టీలు  బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై సీపీఎం నేతలు రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించారు.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి  ఉప ఎన్నికలు ఆరు మాసాల్లోపుగా జరగాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.  

ఈ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలను  కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  దీంతో లెఫ్ట్ పార్టీల మద్దతు కోసం పార్టీలు ప్రయత్నాలు చేశాయి. ఈ నియోజకవర్గంలో లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios