Asianet News TeluguAsianet News Telugu

భార్య ఫోన్ లో మాట్లాడుతుందని కొట్టి చంపిన భర్త.. చివరికి...

ఓ వ్యక్తి భార్య మీద అనుమానంతో ఆమెను చెక్కతో కొట్టి చంపాడు. విషయం తెలియడంతో అరెస్టై జైలుకు వెళ్లాడు. వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. 

husband kills wife over suspicion on extra marital affair in hyderabad
Author
First Published Sep 1, 2022, 11:37 AM IST

హైదరాబాద్ : ఓ భర్త అనుమానంతో భార్యని తెగనరికాడు. దీంతో అప్పటి వరకు భార్యా పిల్లలతో కళకళలాడుతున్న ఇల్లు స్మశానంలా మారిపోయింది. ఆవేశంతో భార్యను హతమార్చిన భర్త జైలు పాలయ్యాడు.. ఏం జరుగుతుందో తెలియని ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఆ పసివారి ఏడుపులు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ సీఐ జగదీశ్వరరావు తెలిపిన కథనం మేరకు…

మహబూబ్ నగర్ జిల్లాలోని మహమ్మదాబాద్ మండలానికి చెందిన ఆముదాల గడ్డ తండా నివాసి లలిత (28), మౌలాలిలోని హనుమాన్ నగర్ లో ఉండే శంకర్తో పదేళ్ల కిందట ఆమెకు వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్లు, మూడేళ్ల కుమారులు సంతానం. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో భార్య లలిత తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతుండటంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త శంకర్.

ఈ విషయమై తరచూ భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడేవారు. మంగళవారం కూడా వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో భర్త శంకర్ పక్కనే ఉన్న చెక్కతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శంకర్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

శేరిలింగంపల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆగస్ట్ 5న ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త అతికిరాతకంగా భార్యను హత్య చేసి పంట కాలువలో పడేసిన ఉదంతం నిడమర్రు మండలంలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం అనుమానంతోనే ఈ ఘాతుకానికి  పాల్పడడం.. స్థానికంగా కలకలం రేపింది. నిడమర్రు ఎస్ఐ కే గురవయ్య, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..  నిడమర్రు గ్రామానికి చెందిన వీరన్న, రమ్య (26)కు ఆరేళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరన్న వ్యాన్ నడుపుతుంటాడు. రమ్య కూలీ పనులు చేస్తుంది.  అలా వారు సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. 

ఈ క్రమంలో వీరన్నకు తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం కలిగింది. ఈ విషయం మీద జూలై నెల 31వ తేదీ రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ చిలికి చిలికి గాలివానగా మారడంతో..  కోపం పట్టలేని వీరన్న భార్యను పీక పిసికి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని తన వ్యాన్లోకి ఎక్కించి, నిడమర్రు కాలనీ సమీపంలో ఉన్న వంతెన వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ వ్యాను ఆపుకుని మృతదేహాన్ని పై నుంచి కాల్వలోకి విసిరేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు.

అనుకున్నపని సజావుగా అయిపోవడంతో.. ఏమీ తెలియనట్టు నాటకం మొదలుపెట్టాడు. తన భార్య కనిపించడం లేదని చెప్పి బంధుమిత్రులతో కలిసి చుట్టుపక్కలా గాలించాడు. అంతేకాదు ఈ మేరకు నిడమర్రు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే వీరన్నపైనే అనుమానం ఉందని రమ్య తల్లి సత్యవతి ఫిర్యాదు చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు ఆ దిశగా విచారించగా.. వీరన్నే నేరం చేశాడని తేలింది. నేరాన్ని అంగీకరించిన వీరన్న.. భార్య మృతదేహం ఎక్కడ పడేసిందీ ఆచూకీ తెలిపాడు.  పోలీసులు గురువారం కాలువలో గాలించగా తూడులో చిక్కుకుని కుళ్లిపోయి ఉన్న రమ్య మృతదేహం లభించింది. వీరన్నపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు ఎస్సై  తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios