రంగారెడ్డి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డి ఘటన మరవక ముందే మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సిద్దులగుట్ట వెళ్లేదారిలో ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. 

ప్రియాంకరెడ్డి హత్య కేసు విచారిస్తున్న తరుణంలో మహిళ హత్యకు గురవ్వడం తెలంగాణ ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

 

హత్యకు గురైన మహిళ వయసు 35 సంవత్సరాల వయసు ఉండే అవకాశం ఉందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు పోలీసులు.  నిర్మానుష్య ప్రాంతమైన సిద్దులగుట్టలో మహిళ హత్యకు గురవ్వడంపై స్థానికంగా కలకలం రేపుతోంది.

video news : శంషాబాద్ లో మరో మహిళ సజీవదహనం  

అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు స్థానికులను ప్రశ్నించారు. అయితే స్థానికంగా ఉండే అర్చకులు తాను ఒక మహిళ తిరగడాన్ని గమనించినట్లు చెప్పుకొచ్చారు. ఆమె ఏడుస్తూ కనిపించిందని ఎందుకు ఏడుస్తున్నావని తాను అడగ్గా హిందీలో ఏదో చెప్పిందన్నారు. ఆమె ఏం చెప్పిందో తనకు అర్థం కాలేదన్నారు ఆలయ అర్చకులు. . 

దాంతో పోలీసులు మహిళది హత్య కాదని ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె అర్చకులతో మాట్లాడిన తీరు చూస్తే ఉత్తరాదివాసిగా పోలీసులు భావిస్తున్నారు. ఇకపోతే సిద్దులగుట్ట సీసీ కెమెరాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. 

శంషాబాద్‌లో మరో దారుణం: ప్రియాంక రెడ్డిలాగే మరో మహిళ సజీవదహనం