డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన రంగారెడ్డి కోర్టు

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో  నిందితుడు  నవీన్ రెడ్డికి  రంగారెడ్డి కోర్టు  బెయిల్ నిరాకరించింది.  

Ranga Reddy Court  denies Bail To  Accused  Naveen Reddy in Doctor Vaishali Kidnap case

హైదరాబాద్: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డికి  రంగారెడ్డి జిల్లా కోర్టు  బుధవారంనాడు  బెయిల్ నిరాకరించింది. 2022 డిసెంబర్  9వ తేదీన  డాక్టర్ వైశాలిని  నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు.  డాక్టర్ వైశాలిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో  నవీన్ రెడ్డి ఆమెను కిడ్నాప్  చేశాడు.  పోలీసులు గాలిస్తున్నారని గుర్తించిన నవీన్ రెడ్డి  డాక్టర్ వైశాలిని  హైద్రాబాద్ సమీపంలో వదిలేసి  గోవాకు పారిపోయాడు.  డిసెంబర్ 14న నవీన్ రెడ్డిని  గోవాలో  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఈ కేసులో నవీన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా  పోలీసులు పేర్కొన్నారు.  ఈ కేసులో  అరెస్టైన  నవీన్ రెడ్డి  ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా  ఉన్నాడు.   బెయిల్ కోసం  నవీన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు ఇవాళ తిరస్కరించింది. 

రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మన్నెగూడలో  డాక్టర్ వైశాలిని  నవీన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు.  నవీన్ రెడ్డిని  డిసెంబర్  మాసంలో పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.  వైశాలి కిడ్నాప్   ప్లాన్ గురించి  పోలీసులు కీలక విషయాలను సేకరించారు. 2022 డిసెంబర్  25వ తేదీన నవీన్ రెడ్డి కస్టడీ ముగిసింది. కస్టడీ సమయంలో  ఈ కేసుకు సంబంధించి  నవీన్ రెడ్డితో  సీన్ రీ కన్ స్ట్రక్షన్  చేయించారు పోలీసులు. 

నవీన్ రెడ్డి తనపై చేసిన  ప్రచారంపై  డాక్టర్ వైశాలి  ఆవేదన వ్యక్తం చేశారు. బాడ్మింటన్ ఆడేందుకు తాను వెళ్లే సమయంలో  నవీన్ రెడ్డి తో పరిచయం ఏర్పడిందని ఆమె  అప్పట్లో ప్రకటించారు. నవీన్ రెడ్డి చెప్పే మాటల్లో వాస్తవం లేదని కూడా  వైశాలి  అప్పట్లో  చెప్పారు.   నవీన్ రెడ్డిపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు సకాలంలో  స్పందిస్తే  వైశాలి  కిడ్నాప్ జరిగేది కాదని  కుటుంబ సభ్యులు అబిప్రాయపడిన విషయం తెలిసిందే. 

also read:వైశాలి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు..

వైశాలిని కిడ్నాప్ చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా  నవీన్ రెడ్డి  జాగ్రత్తలు తీసుకున్నారు. తన ఫోన్ ను కారులో విజయవాడ వైపునకు పంపారు. పోలీసుల దృష్టిని మరల్చి  నవీన్ రెడ్డి  గోవాకు పారిపోయాడు. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు  ఉపయోగించిన కారును శంషాబాద్  కు సమీపంలో  వదిలి వెళ్లాడు నవీన్ రెడ్డి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios