రంజాన్ పండుగ: ముస్లిం ఉద్యోగుల పని వేళలను తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగుల పనివేళలు తగ్గించింది. ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుగుణంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

Telangana govt reduces work hours for Muslim: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగుల పనివేళలు తగ్గించింది. ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుగుణంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు/ కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్/ బోర్డులు/ ప్రభుత్వ రంగ ఉద్యోగులు ప్రార్థనలు చేసుకునేందుకు గంట ముందుగానే కార్యాలయాలు/ పాఠశాలల నుంచి బయటకు రావడానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. పవిత్ర రంజాన్ మాసంలో సాయంత్రం 4 గంటలకు తమ కార్యాలయాలు/పాఠశాలల నుంచి బయటకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అనుమతినిచ్చింది.
టీఎస్–ఎంఎస్ సెంట్రల్ అసోసియేషన్-హైదరాబాద్ చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.