ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితమైపోయింది. ఇక తెలంగాణలోనూ కాంగ్రెస్ కి అదే గతి పట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు.. అధికారిక టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. తాజాగా.. మరో మహిళా నేత కూడా.. కారు ఎక్కడానికి రెడీ అయిపోయింది. మొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్ లను టిట్టిపోసిన ఆమె.. ఇప్పుడు వారి పక్కనే బెర్త్ కన్ఫామ్ చేసుకుంటోంది.

టీపీసీసీ అధికార ప్రతినిధి, సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.
 
కాగా.. కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులు ఈమె కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు విషయం విదితమే. మరీ ముఖ్యంగా త్వరలోనే హరీశ్ రాజీనామా చేస్తారని.. సిద్ధిపేట నుంచి ఆయన సతీమణి పోటీ చేయబోతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం కూడా రేపాయి.  కాగా ఇటు కేసీఆర్‌పై.. ఆయన కుటుంబం సభ్యులపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన రమ్యారావు కారెక్కుతారని  ఎవరూ ఊహిచంచలేదు.