యశోద ఆస్పత్రిలో చికిత్స

ఈనాడు, ఈ టీవీ సంస్థల అధిపతి రామోజీరావు అనారోగ్యానికి గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎన్‌వీ రావు, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ నవనీతసాగర్‌ రెడ్డిల బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తోంది.