Asianet News TeluguAsianet News Telugu

సత్తుపల్లిలో విషాదం: కొడుకును ఖననం చేసిన స్థలంలోనే తండ్రి సూసైడ్

 కొడుకును ఖననం చేసిన స్థలంలోనే తండ్రి రాంబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన సత్తుపల్లిలో చోటు చేసుకొంది. కొడుకు మరణంతో మనోవేదనకు గురైన రాంబాబు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Rambabu Commits Suiicide in Sattupalli
Author
Hyderabad, First Published Dec 19, 2021, 12:21 PM IST

సత్తుపల్లి: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకొన్న విషాద ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో చోటు చేసుకొంది. Sathupalliకి చెందిన  Rambabu కుటుంబం  Khammam లో నివాసం ఉంటుంది. రాంబాబు కొడుకు Sai  పదో తరగతి చదువుతున్నాడు. సాయి స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు.  Birth day  కావడంతో ఈ నెల 14న స్నేహితులతో కలిసి సాయి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకల విషయమై స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు కూడా సాయిని మందలించారు.

also read:నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం... మతాంతర వివాహం చేసుకోలేక, ప్రేమజంట ఆత్మహత్య

అంతేకాదు సాయిని స్కూల్ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ పరిణామంతో మనోవేదనకు గురైన సాయి Suicide attempt చేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ కు తరలించారు. Hyderabad ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న సాయి మృతి చెందాడు.  సాయి మృతదేహన్ని రాంబాబు తన స్వగ్రామం సత్తుపల్లిలో నిర్వహించాడు.  కొడుకు మరణంతో రాంబాబు తట్టుకోలేకపోయాడు.  ఈ నెల 18న  రాంబాబు ఇంటి నుండి వెళ్లిపోయి ఎంతకీ తిరిగి రాలేదు.  కుటుంబ సభ్యులు వెతికారు. అయితే తన కొడుకును ఖననం చేసిన ప్రాంతంలోనే చెట్టుకు రాంబాబు ఉరేసుకొని suicide కు పాల్పడ్డాడు. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

స్కూల్ యాజమాన్యాదే బాధ్యత: సాయి తల్లి 

తన కొడుకు తప్పు లేకున్నా ఇష్టమొచ్చినట్టుగా తన కొడుకును స్కూల్ యాజమాన్యం తిట్టిందని  దీంతో మనోవేదనకు గురైన సాయి ఆత్మహత్య చేసకొన్నాడని సాయి తల్లి ఆరోపించింది. సాయిని తిట్టిన విషయాన్ని తోటి విద్యార్ధులు తనకు చెప్పారనన్నారు.  తాము బాధపడతామనే ఉద్దేశ్యంతోనే సాయి చెప్పలేదన్నారు. సాయి చనిపోవడానికి స్కూల్ యాజమాన్యమే కారణమని ఆమె ఆరోపించారు. తన కొడుకు మరణానికి కారణమైన  స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios