రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ తరుఫున నామినేషన్ దాఖలు చేసిన పార్థసారధి రెడ్డి ఓ రికార్డు నెలకొల్పనున్నారు. పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న దేశంలోనే అత్యంత సంపన్నుడిగా మారనున్నారు. ఆయనకు, ఆయన కుటుంబానికి కలిపి మొత్తంగా 5 వేల కోట్లకు పైగా ఆస్తి ఉంది.
టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగిన హెటిరో గ్రూప్ చైర్మన్ బండి పార్థసారధి రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా అవతరించనున్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో పార్థ సారధి రెడ్డి తన అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలు అందజేశారు. ఈ వివరాల ప్రకారం ఆయన ఆస్తులు దాదాపు రూ. 3,909 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా ఆయన కుటుంబంతో కలిపి రూ. 5,300 కోట్ల ఆస్తి ఉంది. ఆయన ఆస్తిలో ఎక్కవగా భంగా హెటెరో గ్రూప్‌లో షేర్లు, పెట్టుబడుల రూపంలో ఉన్నాయి.
తనను ప్రేమించి మరో యువతితో వివాహం.. పెళ్లై 24 గంటలు గడవకముందే ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా..
2021 సంవత్సరం వరకు బీహార్ కు చెందిన దివంగత మహేంద్ర ప్రసాద్ తన భార్య, హిందూ అవిభాజ్య
కుటుంబం (HUF) కింద రూ. 4,070 కోట్ల ఆస్తులస్తుతో అత్యంత సంపన్నఎంపీగా ఉన్నారు. ఆయన జనతాదళ్ (యునైటెడ్) నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2021 సంవత్సరంలో ఆయన మరణించారు. ప్రసాద్ మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్కీ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రూ.2,577 కోట్ల ఆస్తులస్తుతో అత్యం త సంపన్న ఎంపీగా నిలిచారు. కాగా ఆ ట్యాగ్ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఎన్నిక కానున్న ఫార్మా స్యూటికల్ వ్యాపారవేత్త పార్థసారధి రెడ్డి కి దక్కబోతోంది.
పెళ్లి బరాత్ లో అపశృతి.. డ్యాన్స్ చేస్తున్న వారిపైకి కారు పోనిచ్చిన పెళ్లి కొడుకు..బాలుడు మృతి..
పార్థసారధి రెడ్డికి చెందిన రూ.3,858 కోట్ల చరాస్తుల్లో దాదాపు రూ.3,407 కోట్లు షేర్ల రూపంలో ఉన్నాయి. మిగిలిర రూ.1,249 కోట్లలో దాదాపు రూ. 1,140 కోట్లు ఆయన భార్య ఆస్తి.. కాగా రూ. 105 కోట్లు HUFలో ఉన్నాయి. 2020-21లో పార్థసారధి, అతని కుటుంబ ఆదాయం రూ. 140 కోట్లు. ఇందులో ఎక్కువగా అద్దె డిపాజిట్ల రూపంలో దాదాపు రూ.73 కోట్లుగా ఉన్నాయి. ఆయన వద్ద రూ.13 కోట్ల విలువైన, ఆయన భార్య వద్ద రూ.6 కోట్ల విలువైన నగలు ఉన్నాయి.
17మంది మహిళల్ని చంపిన నరహంతకుడికి జీవితఖైదు..కల్లు, మద్యం తాగేవారే టార్గెట్..
1997లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్ డీ పూర్తి చేసిన పార్థసారధి రెడ్డి.. 2021 సంవత్సరంలో హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం రూ. 16,000 కోట్ల నికర విలువ కలిగి ఉన్నారు. అయితే అఫిడవిట్ లో పొందుపర్చిన వివరాల ప్రకారం పార్థసారధి రెడ్డి, ఆయన భార్యకు ఇద్దరిద్దకీ సొంత వాహనం లేదు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద ఆయనపై నాలుగు కేసులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో నాణ్యత లేని ఔషధాన్ని తయారు చేసి పంపిణీ చేశారనే ఆరోపణలపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కేసు నమోదు చేసింది. బీహార్ లోని ముజఫర్ నగర్ కోర్టులో మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. నాలుగో కేసు తమిళనాడులోని సేలంలో నమోదైంది.
