తనను ప్రేమించి మరో యువతితో వివాహం.. పెళ్లై 24 గంటలు గడవకముందే ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా..

తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ.. పెల్లైన 24 గంటలలోపే పెళ్లి ఇంటిముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన హైదరాబాద్ లోని హబ్సి గూడలో జరిగింది. 

Girlfriend dharna in front of Boyfriends house in hyderbad

హబ్సిగూడ : పెళ్లయిన 24 గంటలు గడవకముందే నన్ను ప్రేమించి మరో యువతితో marriage చేసుకోవడం ఏంటంటూ.. పెళ్లి బాజాలు మోగిన ఇంటిముందు ఓ woman నిరసనకు దిగిన ఘటన గురువారం హైదరాబాద్ Habsiguda డివిజన్ వెంకట్ రెడ్డి నగర్ లో జరిగింది.  వివరాల్లోకి వెడితే.. వెంకట్ రెడ్డి నగర్ కు చెందిన శ్రీకాంతచారి, తాను 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని రామంతాపూర్ కు చెందిన లక్ష్మీ (29) తెలిపింది.

తనను కాదని బుధవారం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. ప్రేమ పేరిట మోసం చేసి మరొక వివాహం చేసుకున్న శ్రీకాంతాచారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. బాధితురాలు గురువారం నిందితుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆదర్శ మహిళా సంఘం సభ్యులు మద్దతు తెలిపారు. ప్రేమ, పెళ్లి కథ చివరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు చేరింది. లక్ష్మికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు. నిరసనలో ప్రతిభా, మంజుల, సంధ్య, బేగం, జానకి, బాలమని తదితరులు పాల్గొన్నారు. 

ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసున్న యువతి ఒకదానిమీద ఒకటి మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఇందులో ఎవరికీ విడాకులు ఇవ్వకపోవడం విచిత్రం. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం… మిట్నాలకు చెందిన  మేరీ జక్సింట అలియాస్ మేరమ్మ కూతురు శిరీషకు గతంలో అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పాణ్యం మల్లికార్జునతో మొదటి వివాహం అయ్యింది. ఆయనతో విడాకులు తీసుకోకుండా ఆత్మకూరు మండలం కొత్తపల్లెకి చెందిన శ్రీనివాస్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకుంది. 

రెండో భర్తతో విడాకులు పొందక ముందే బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం వాసి మహేశ్వరరెడ్డిని మనవాడేందుకు నిర్ణయించుకుంది. ఆయనకు కూడా రెండో వివాహం కావడంతో.. తనకు రక్షణగా ఐదు లక్షలు రూపాయలు డిపాజిట్ చేయాలని షరతు విధించింది. ఆయన ఫిబ్రవరి 1న.. రూ.5 లక్షలు డిపాజిట్ చేయగా..  ఫిబ్రవరి 5న మద్దిలేటి స్వామి ఆలయంలో వారిద్దరికీ వివాహం అయ్యింది. అయితే శిరీష తల్లి మేరమ్మ తరచూ ఆర్ఎస్ రంగాపురం వస్తూ తన కూతురిని అత్తారింట్లో ఉంచాలంటే కొంత ఆస్తి రాసి ఇవ్వాలని అని డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి.. శిరీష గురించి విచారించగా.. ఆమెకు ఇప్పటికే రెండు వివాహాలు జరిగినట్లు తెలుసుకుని ఆవాక్కయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios