ఆ వరుడు సరదాగా చేసిన పని ఓ బాలుడి ప్రాణాలు తీసింది. డ్రైవింగ్ తెలియకపోయినా కారు నడపడంతో అది పెళ్లి బరాత్ లో డ్యాన్ చేస్తున్న వారిపైకి వెళ్లిపోయింది. పలువురికి గాయలు అయ్యాయి. ఒక బాలుడు చనిపోయాడు.
ఉదయం సమయంలో ఆ ఊర్లో ఘనంగా పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులు అందరూ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి తతంగం పూర్తయ్యి సాయంత్రం సమయంలో కొత్త జంట వదువు గ్రామానికి చేరుకుంది. వధువు గ్రామంలో కుటుంబ సభ్యులు పెళ్లి బరాత్ ఏర్పాటు చేశారు. గ్రామ యువకులు, బంధువులు, స్నేహితులు అంతా ఆ డీజే పాటలలో స్టెప్పులేశారు. కొంత సమయం వదూవరులిద్దరూ కూడా ఆ పాటలకు కాలుకదిపారు. అంతా బాగానే ఉంది ఇంకాసెపట్లో పెళ్లి కొడుకు ఇంటికి ఈ బరాత్ చేరుకుంటుందనగా ఓ విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. పలువురికి గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటనలో కారు నడిపింది పెళ్లికొడుకే కావడం ఇక్కడ విచారకరం. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
17మంది మహిళల్ని చంపిన నరహంతకుడికి జీవితఖైదు..కల్లు, మద్యం తాగేవారే టార్గెట్..
నల్గొండ జిల్లా చండూరులోని గట్టుప్పలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మల్లేష్ పెళ్లి బుధవారం జరిగింది. యాదాద్రి భువనగిరి డిస్టిక్ట్ సంస్థాన్ నారాయణపురంలో పెద్దలు, బంధు మిత్రులు సమక్షంలో ఘనంగా ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు. పెళ్లి, ఇతర పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత వదూవరులిద్దరూ ఆ గ్రామానికి చేరుకున్నారు. ఊర్లో ముందే అనుకున్న ప్రకారం బరాత్ ఏర్పాటు చేశారు. ఆ బరాత్ పెళ్లి కొడుకు ఇంటికి ఊరేగింపుగా వెళ్తోంది.
డీజే పాటలతో బంధు మిత్రులు, పిల్లలు అందరూ సంతోషంగా స్టెప్పులేశారు. ఆ పెళ్లి కొడుకు ఇంటికి బరాత్ ఇంకా కొద్ది దూరంలో ఉంది. ఈ క్రమంలో వదూవరులు ఇద్దరూ వారి కారులో నుంచి దిగారు. ఆ బరాత్ లో చుట్టాలు, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ ప్రాంతమంతా కోలహలంగా మారిపోయింది. అయితే డీజే కొంచెం ముందుకు సాగడంతో వదూవరులు వచ్చిన కారు వెనకాలే ఉండిపోయింది. ఆ కారు డ్రైవర్ ఆ చుట్టుపక్కలే ఉన్నాడు. కొంత దూరమే కదా అని ఆ పెళ్లి కొడుకు వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. కానీ నిజానికి అతడికి డ్రైవింగ్ తెలియదు.
సిద్ధిపేట జిల్లాలో ఆటో, లారీ ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి...
కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. అయితే ఆ కారు వరుడుకి కంట్రోల్ కాలేదు. ఒక్క సారిగా అది డీజే ముందు డ్యాన్ చేస్తున్న వారిపైకి దూసుకొని వెళ్లింది. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ వారందూ ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఆ కారు వెళ్లి డీజే ఉన్న డ్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో డీజే ముందు డ్యాన్స్ చేస్తున్న దుబ్బాక సాయిచరణ్ (13) అనే బాలుడు చనిపోయాడు. పలువురికి గాయాలు అయ్యాయి. పెళ్లి కొడుకు కూడా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే పెళ్లి కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
