హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తల్లిని చంపిన కీర్తి కేసులో దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. కీర్తికి అబార్షన్ చేసిన ఆస్పత్రిపై వైద్యఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 

కీర్తి తన ప్రియుడు బాల్ రెడ్డి వల్ల గర్భందాల్చింది. గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని భావించిన కీర్తి ఆమె ప్రియుడు బాల్ రెడ్డిలు ఆందోళన చెందారు. 
కీర్తికి అబార్షన్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించిన బాల్ రెడ్డి అందుకు కీర్తి ఇంటికి దగ్గర్లో ఉంటున్న శశిని సంప్రదించారు. అందుకు శశి తనకు తెలిసిన వైద్యుడు ఉన్నారని ఆయన దగ్గరకు వెళ్తే అబార్షన్ చేస్తారని చెప్పాడు. 

అబార్షన్ కు కీర్తి, బాల్ రెడ్డి అంగీకరించడం తో శశి వారిని మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమనగల్ లోని పద్మనర్సింగ్ హోమ్ లో అబార్షన్ చేయించాడు శశి. రంగారెడ్డి డీఎం అండ్ హెచ్ ఓ స్వరాజ్యలక్ష్మి నేతృత్వంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 

అయితే సోదాలు జరుగుతున్న సమయయంలో ఆస్పత్రి వైద్యుడు డా.బి.హేమలాల్ పరారయ్యాడని తెలుస్తోంది. అనంతరం ఆస్పత్రిని వైద్యఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. కీర్తి తల్లి రజిత హత్య కేసులో ఈ వ్యవహారం బయటకు రావడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

ఇకపోతే పద్మ నర్సింగ్ హోమ్ లో అబార్షన్ చేసినట్లు ఆరోపణలు రావడం, అవి వాస్తవమని తేలడంతో ఆస్పత్రిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. 

ఈ వార్తలు కూడా చదవండి

గతంలోనూ తల్లిని చంపేందుకు ప్లాన్, బలవంతంగా కీర్తిని వశపరుచుకున్న శశి

తల్లి రజితను చంపిన కీర్తి: దృశ్యం సినిమాకు రెండో వెర్షన్