హైదరాబాద్:  రూ. 10 లక్షల కోసం తల్లి రజితను కీర్తి ప్రియుడు శశికుమార్‌తో కలిసి హత్య చేసినట్టుగా  రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.ఈ నెల 19వ తేదీన  రజితను  కీర్తి, శశికుమార్‌లు కలిసి హత్య చేశారు. ఈ హత్య గురించిన వివరాలను గురువారం నాడు రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాకు వివరించారు.

Also Read:రెండో ప్రియుడ్ని సోదరుడిగా చూపించి.. ఫస్ట్ లవర్‌తో కీర్తి డ్రామా

రజిత మృతదేహన్ని రామన్నపేటకు తరలించేందుకు ఉపయోగించిన కారుతో పాటు నిందితులు వాడిన నాలుగు సెల్‌పోన్లను కూడ స్వాధీనం చేసుకొన్నట్టుగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. తెలుగు సినిమా దృశ్యం సినిమాకు రెండో వెర్షన్‌గా  ఉందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు.

Also Read: ఒకరికి బ్రేకప్, మరొకతనితో లవ్: అమ్మను చంపి దొరికాక ఏడ్చేసిన కీర్తి

పలు దఫాలు  రజితను హత్య చేసేందుకు కీర్తీ ప్లాన్ చేసింది.ఈ విషయాన్ని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. నిద్ర మాత్రలు ఇచ్చి రజితను హత్య చేయాలని ప్లాన్ చేశారు. కానీ, గతంలో చేసిన ప్లాన్స్  సక్సెస్ కాలేదు. కానీ, ఈ దఫా ప్లాన్ మాత్రం సక్సెస్ అయింది.

Also Read: లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే

కీర్తిపై ఈ ఏడాది జనవరి మాసంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే అబార్షన్ చేయించాలని కీర్తి రెడ్డి బాల్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే  శశికుమార్ ను తన సోదరుడిగా బాల్ రెడ్డికి కీర్తి పరిచయం చేసింది. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని ఆమన్‌గల్ ఆసుపత్రిలో కీర్తి అబార్షన్ చేయించుకొంది.

ఈ అబార్షన్ వ్యవహారాన్ని శశి కుమార్ తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేశాడు. బాల్‌రెడ్డి కారణంగా కీర్తిరెడ్డి గర్భం దాల్చిన విషయాన్ని కీర్తి కుటుంబసభ్యులకు చెబుతానని బెదిరించాడు. 

Also Read: ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో. 

ఈ విషయాన్ని సాకుగా చూపించి కీీర్తిరెడ్డిని శశికుమార్ లోబర్చుకొన్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను తీశాడు. ఈ ఫోటోలను బయటపెడతానని ఆమె నుండి డబ్బులు డిమాండ్ చేశాడు. రూ. 10 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టాడు.

ఈ నెల 19వ తేదీన శశికుమార్ తో తన కూతురు కీర్తి సన్నిహితంగా ఉన్న విషయాన్ని గుర్తించిన రజిత ఆమెను తీవ్రంగా మందలించింది. అంతేకాదు శశికుమార్ ను కూడ హెచ్చరించింది.

దీంతో రజితను చేయాలని శశికుమార్ కీర్తికి చెప్పాడు. ఈ మేరకు రజిత కళ్లలో కారం కొట్టారు. దీంతో రజిత కళ్లు కన్పించకపోయేసరికి ఆమెను కిందపడేసి హత్య చేశారు.రజిత ఛాతీ భాగంగా కూర్చొని ఆమె రెండు చేతులను కీర్తి గట్టిగా పట్టుకొంది.  ఆ సమయంలో శశికుమార్ చున్నీ సహాయంతో  హత్య చేశారు.

రజితను హత్య చేసిన తర్వాత బాల్‌రెడ్డి ఇంటికి కీర్తి ఫోన్ చేసింది. అచ్చు తన తల్లి రజిత మాట్లాడినట్టుగానే ఫోన్  మాట్లాడింది. తాను వైజాగ్ వెళ్తున్నానని చెప్పింది. తన కూతురును మీ ఇంటికి పంపిస్తున్నానని తల్లి ఫోన్ తో ఫోన్ చేసి చెప్పింది. 

దృశ్యం సినిమాలో మాదిరిగానే  హీరో వెంకటేష్ ఏ రకంగా వ్యవహరిస్తాడో అదే రకంగా రజితను హత్య చేసిన తర్వాత కీర్తి, శశికుమార్ లు అలాగే వ్యవహరించారు. తన తల్లి కన్పించడం లేదంటూ కీర్తిరెడ్డి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన తండ్రి శ్రీనివాస్ రెడ్డి మద్యం తాగి తన తల్లిని  చంపి ఉండొచ్చని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్యూటీ నుండి వచ్చిన ప్రతిసారి తన తండ్రి తన తల్లితో గొడవ పెట్టుకొనేవాడని కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కీర్తి, శశికుమార్‌లను అరెస్ట్ చేసినట్టుగా ఆమె తెలిపారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చిన తర్వాత నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకొంటామని పోలీసులు ప్రకటించారు.