రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్‌లో విద్యార్థులు ఆందోళకు కొనసాగిస్తున్నారు. ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలను చేపట్టాలని కోరుతూ వారు నిరసనకు దిగారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్‌లో విద్యార్థులు ఆందోళకు కొనసాగిస్తున్నారు. ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలను చేపట్టాలని కోరుతూ వారు నిరసనకు దిగారు. గత రెండు రోజులుగా విద్యార్థులు నిరసన బాట పట్టడంతో ఉద్యాన యూనివర్సిటీ అధికారులు హాస్టల్, మెస్‌ను మూసివేసినట్టుగా తెలుస్తోంది. హాస్టల్ నుంచి వెళ్లిపోవాలంటూ వైస్ చాన్స్‌లర్ ఒత్తిడి తెస్తున్నారంటూ విద్యార్థులు చెబుతున్నారు. వైస్ చాన్స్‌లర్‌ తీరును నిరసిస్తూ యూనివర్సిటీ ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. 

నాలుగేళ్లుగా ఉద్యాన విస్తరణాధికారుల నియామకాలు జరగలేదని విద్యార్థులు చెప్పారు. వెంటనే ఉద్యాన విస్తరణాధికారుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైస్ చాన్సిలర్‌ను నిలదీశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజ్ ప్రొఫెసర్లను కూడా విద్యార్థులు అడ్డుకుంటున్నారు. 
డిమాండ్లను పరిష్కరించేంత వరకు లోనికి రానివ్వమని చెబుతున్నారు.